వెస్టిండిస్ తో జరిగిన మూడు టీ20 మ్యాచుల సీరిస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ మొదట బౌలింగ్ లో దీపక్ చాహర్...ఆ తర్వాత లక్ష్యఛేదనలో కెప్టెన్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టారు. చాహర్ విండీస్ కు చెందిన ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత  147 పరుగుల లక్ష్యంతో బరితోకి దిగిన టీమిండియా కేవలం 27పరుగులకే ఓపెనర్లిద్దరికి కోల్పోయి క్లిష్ట సమయంలో వున్నపుడు కోహ్లీ(59 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.అతడికి రిషబ్ పంత్(65 పరుగులతో నాటౌట్) తోడవడంతో భారత్ మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20  సీరిస్ టీమిండియా వశమయ్యింది. 

 టీమిండియా కేవలం 27 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. మొదట శిఖర్ ధవన్(4 పరుగులు) ఔటవగా ఆ తర్వాత మరో ఓపెనర్ కెఎల్ రాహుల్(20 పరుగులు) కూడా పెవిలియన్ బాట పట్టాడు.మంచి జోరుమీదున్నట్లు కనిపించిన రాహుల్ అలెన్ ఔట్ చేశాడు.

 ఇప్పటికే  టీ20 సీరిస్ కోల్పోయిన విండీస్ చివరి  మ్యాచ్ లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని చూసింది. అయితే ఆరంభంలో దీపక్ చాహర్ దెబ్బకు తడబడ్డా చివర్లో పట్టుదలతో ఆడాడు. ముఖ్యంగా పొలార్డ్ హాఫ్ సెంచరీ, చివర్లో పోవెల్ కేవలం 20 బంతుల్లోనే 30 పరుగులు చేయడంతో  విండీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని టీమిండియా ముందుచగలిగింది. నిర్ణీత ఓవర్లలో విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో దీపక్  చాహర్ 3, సైనీ 2, రాహుల్ చాహర్ 1 వికెట్ పడగొట్టారు. 

ఆరంగేట్ర ఆటగాడు రాహుల్ చాహర్ ఎట్టకేలకు తన అంతర్జాతీయ కెరీర్లో మొదటి వికెట్ పడగొట్టాడు. విండీస్ కెప్టెన్  బ్రాత్  వైట్ వికెట్ తీయడం  ద్వారా  అతడి ఖాతాలోకి మొదటి వికెట్ చేరింది.  

పరుగుల వేగం పెరుగుతున్న సమయంలో హాఫ్ సెంచరీ(58 పరుగులు)తో అదరగొట్టిన పొలార్డ్ ను సైనీ ఔట్ చేశాడు.అంతకు ముందే పూరన్(17 పరుగులు) కూడా మళ్ళీ సైనీ  బౌలింగ్ లోనే ఔటయ్యాడు.  

వెస్టిండిస్ టాాప్ ఆర్డర్ దీపక్ చాహర్ ఓ ఆట ఆడుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ పై చెలరేగుతున్న అతడు వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. తాను వేసిన మొదటి  ఓవర్లోనే నరైన్ ను ఔట్ చేసి ఆ తర్వాతి ఓవర్లో లూయిస్, హెట్మెయర్ లను పెవిలియన్ కు పంపించాడు. దీంతో కేవలం 14 పరుగుల వద్ద ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. 

అభిమానులు ఊహించినట్లుగా మూడో టీ20లో టీమిండియాకు రోహిత్ కాకుండా కోహ్లీ సారథ్యం వహించాడు. కోహ్లీ ఈ మ్యాచ్ కు విశ్రాంతి తీసుకోనున్నాడని ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా రోహిత్ విశ్రాంతి తసుకుంటున్నారు. 

కొద్దిసేపటి క్రితమే నిర్వహించిన టాస్ టీమిండియా గెలిచింది. దీంతో కోహ్లీ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో విండీస్  మొదట  బ్యాటింగ్ చేయనుంది. 

ఇండియా టీం:

కెఎల్ రాహుల్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ

వెస్టిండిస్ టీం: 

కార్లోస్ బ్రాత్ వైట్, లూయిస్, క్యాంప్ బెల్, నికోలస్ పూరన్, హెట్మెయర్, పోవెల్, సునీల్ నరైన్, కీమో పాల్, కాట్రెల్, థామస్, అలెన్ 
 

భారత్-వెస్టిండిస్ ల మధ్య ఇవాళ(మంగళవారం) జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం అడ్డుగా నిలిచింది. గయానా లో ఇవాళ ఉదయం నుండి కురుస్తున్న వర్షం ఇంకా తగ్గలేదు. దీంతో 8గంటలకే ప్రారంభంకావాల్సిన మ్యాచ్ కోసం కనీసం టాస్ కూడా నిర్వహించలేని విధంగా పరిస్థితి వుంది. వర్షం ఎడతెరిపి  లేకుండా కురుస్తూనే వుండటంతో  పిచ్ పై కవర్లు కప్పి తడవకుండా కాపాడుతున్నారు. 

అయితే కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గడంతో అంపైర్లు పిచ్ ను పరిశీలించారు. ఆటకు అనుకూలంగా వున్నట్లు నిర్దారించుకు  మరికొద్దిసేపట్లో టాస్ నిర్వహణకు అనుమతించారు. మళ్లీ వర్షం అడ్డుపడకుంటే మ్యాచ్ ఆరంభంకానుంది.  

 మూడు టీ20 మ్యాచుల సీరిస్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచులను గెలుపొందింది. ఇలా ప్లోరిడాలో జరిగిన వరుస టీ20లను గెలవడం మరో మ్యాచ్ మిగిలుంగానే సీరిస్ టీమిండియా  వశమయ్యింది. దీంతో నామమాత్రంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ని ఆడించడంలేదని సమాచారం. దీంతో రోహిత్ శర్మ టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.  

అలాగే  ఈ మ్యాచ్ లో మరికొంత యువకులను పరీక్షించే అవకాశాలు కనిపిస్తున్నారు. రాహుల్ చాహర్ ఈ టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.