సూర్య, సంజూ శాంసన్ జెర్సీ వేసుకోవడానికి అసలు కారణం ఇదే... అప్పుడు అర్ష్‌దీప్ సింగ్ జెర్సీలో...
సంజూ శాంసన్ జెర్సీలో ఫీల్డింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్... రెండో వన్డే సమయానికి వెస్టిండీస్ చేరుకోబోతున్న సూర్య కొత్త జెర్సీ..

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వన్డేల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి వరుస అవకాశాలు ఇవ్వడంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్నటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ జెర్సీలో ఫీల్డింగ్ చేయడం, బ్యాటింగ్‌కి రావడం కనిపించింది...
వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్, వ్యంగ్యంగా స్పందించాడు...
‘సంజూ శాంసన్‌కి తుది జట్టులో చోటు దక్కాలంటే ఇదొక్కటే మార్గం ఏమో...’ అంటూ ట్వీట్ చేశాడు ఎస్ బద్రీనాథ్. ఇంతకుముందు ఓ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ జెర్సీ వేసుకుని ఆడాడు. దీనికి అసలు కారణం వేరే ఉందట..
‘సూర్యకుమార్ యాదవ్ జెర్సీ సైజ్ విషయంలో ఓ ఇష్యూ ఉంది. ఇంతకుముందున్న జెర్సీ పట్టకపోవడంతో సైజు మార్చాల్సిందిగా రెండు రోజుల ముందు టీమ్‌కి తెలిపాడు. రెండో వన్డే సమయానికి అతనికి కొత్త జెర్సీ అందుతుంది. టీ20 సిరీస్‌కి సెలక్ట్ అయిన భారత జట్టు ప్లేయర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ కొత్త జెర్సీ వెస్టిండీస్‌కి చేరుకుంటుంది. అందుకని అప్పటి వరకూ సూర్యకుమార్ యాదవ్, తన టీమ్ మేట్స్ జెర్సీలు వేసుకుని ఆడుతున్నాడు...’ అంటూ బీసీసీఐ తెలియచేసింది..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. గత ఆరు వన్డేల్లో నాలుగు సార్లు డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 26 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్..
ఈ మధ్య కాలంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటు నుంచి వచ్చిన బెస్ట్ పర్ఫామెన్స్ ఇదే. ఇదే మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 208 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తాజాగా స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతుల్లో కూడా మ్యాచులు ఓడిన వెస్టిండీస్ బౌలింగ్‌లో కూడా సూర్య తేలిపోయాడు..
రెండో వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌ని కొనసాగిస్తారా? లేక సంజూ శాంసన్‌కి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. టీమ్‌లో ఉన్న వన్డే ప్లేయర్లందరికీ అవకాశం కల్పిస్తామని రోహిత్ శర్మ కామెంట్ చేయడంతో రెండో వన్డేలో కాకపోయినా మూడో వన్డేలో అయినా సంజూ శాంసన్‌కి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.