Asianet News TeluguAsianet News Telugu

ఆరంగేట్ర మ్యాచ్ లోనే సైనీ అదుర్స్... విండీస్ పై టీమిండియా ఘన విజయం

టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య ఇవాళ్టి(శనివారం)  నుండి టీ20 సమరం ఆరంభమవుతోంది. ఇందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ కు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం సిద్దమయ్యింది.  

india vs west indies t20 match updates
Author
Florida, First Published Aug 3, 2019, 7:51 PM IST

వెస్టిండిస్ పర్యటనను టీమిండియా అద్భుత విజయం ఆరంభించింది. భారత బౌలర్ల ధాటికి భారీ హిట్టర్లతో కూడిన విండీస్ టీం విలవిల్లాడిపోయింది. ఇలా కేవలం 95 పరుగుల తక్కువ స్కోరుకే విండీస్ ను కట్టడిచేసి బౌలర్లే సగం విజయాన్ని అందించారు. సాధించాల్సిన రన్ రేట్ తక్కువగా వుండటంతో టీమిండియా బ్యాట్స్ మెన్స్ ఎవ్వరూ రాణించకున్నా భారత జట్టు విజయాన్ని అందుకుంది. 

96 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతూనే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ సాధించిన 24 పరుగులే హయ్యెస్ట్ స్కోర్, అలాగే కెప్టెన్ కోహ్లీ 19, మనీష్ పాండే 19 పరుగులతో ఫరవాలేదనిపించారు. అయితే శిఖర్ ధవన్(1), రిషబ్ పంత్(0)లు ఆకట్టుకోలేకపోయారు. అయినప్పటికి టీమిండియా కేవలం17.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టపోయి విజయతీరాలకు చేరుకుంది. 

ధాటిగా ఆడుతూ టీమిండియాను విజయానికి చేరువ చేసిన మనీష్ పాండే(19 పరుగులు 14 బంతుల్లో) ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ కోహ్లీ(19 పరుగులు) కూాడా ఔటయ్యాడు.ఇలా 69 పరుగుల వద్ద కోహ్లా ఔటయినా భారత్ సాధించాల్సిన రన్ రేట్ చాలా తక్కువగా వుండటంతో విజయాన్ని సాధించగలిగింది.

 విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ భారత్ ను దెబ్బతీశాడు. వరుస బంతుల్లో ఓపెనర్ రోహిత్ శర్మ(24 పరుగులు), రిషబ్ పంత్ లను ఔట్ చేశాడు. పంత్ పరుగులేమీ సాధించకుండానే డకౌటయ్యాడు. ఇలా భారత్ కేవలం 32  పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

96 పరుగుల స్వల్ప లక్ష్యంతో  బరిలోకి దిగిన టీమిండియాకు విండీస్ బౌలర్ కాట్రెల్ ఆదిలోనే షాకిచ్చాడు. గాయంతో ప్రపంచ కప్ కు దూరమైన తర్వాత మొదటి  అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ శిఖర్ ధవన్  వికెట్లు ముందుదొరకబుచ్చుకున్నాడు. ఇలా కేవలం  1పరుగు మాత్రమే చేసిన ధవన్ ఎల్బీడబ్యూగా పెవిలియన్ కు చేరాడు. ఇలా భారత జట్టు కేవలం 4 పరుగుల వద్దే మొదటి వికెట్  కోల్పోయింది. 

ప్లోరిడాలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండిస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. కిరన్ పొలార్డ్ ఒక్కడు పొరాడి 49 పరుగులు చేయడంతో 95 పరుగులు చేయగలిగింది. మొత్తంగా భారత బౌలర్లు అమెరికా  ప్రేక్షకులకు అసలు సిసలైన బౌలింగ్ అంటే ఎలా వుంటుందో చూపించి ఆకట్టుకున్నారు. 

భారత బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు నవదీప్ సైనీ మాయ చేశాడు. మొదటి  ఓవర్లోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ అవకాశాన్ని పొందాడు. అయితే అది మిస్సయింది. అలాగే చివరిఓవర్ ను మెయిడెన్ గా పూర్తిచేయడమే  కాదు పొలార్డ్(49 పరుగులు) వికెట్ పడగొట్టి హాఫ్ సెంచరీని అడ్డకున్నాడు. అతడి తర్వాతి భువనేశ్వర్ 2, వాషింగ్టన్ సుందర్, పాండ్యా, జడేజా, ఖలీల్ అహ్మద్ లు తలో వికెట్ పడగొట్టారు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగుల వద్దే ఆగిపోయింది. 

వెస్టిడిస్ జట్టులో పొలార్డ్ (49 పరుగులు), పూరన్ (20 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతావారందరూ కేవలం సింగిల్ డిజిట్ వద్దే ఔటయ్యాడు. అందులో ఐదుగురు ఏకంగా  డకౌటయ్యారు. 

విండీస్ 88 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కీమో పాల్ ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు.వెస్టిండిస్ 70 పరుగుల వద్ద  ఏడో  వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఔటయిన  తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ కేవలం 2 పరుగుల మాత్రమే చేసి జడేజా కు వికెట్ సమర్పించుకున్నాడు. 

భారత బౌలర్ పాండ్యా బౌలింగ్ కెప్టెప్ బ్రాత్ వైట్ బౌలర్ కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందే బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడిపోతోంది. కేవలం 5  ఓవర్లలోనే 33 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి  విండీస్ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది.  

ఆరంగేట్ర మ్యాచ్ లోనే టీమిండియా యువ బౌలర్ నవదీప్ సైనీ అదరగొట్టాడు. తాను వేసిన మొదటి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్ పడగొట్టి కొద్దిలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. మొదట పూరన్ ను ఔట్ చేసిన సైనీ ఆ తర్వాత హెట్మెయర్ ను డకౌట్ చేశాడు. దీంతో వీండీస్ 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

టీమిండియా ఆరంగేట్ర ఆటగాడ నవదీప్ సైనీ మొదటి వికెట్ పడగొట్టాడు. మంచి ఫామ్ లో వున్న పూరన్(20 పరుగులు) ని సైనీ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో బంతి బ్యాట్ అంచులను తాకి గాల్లోకి లేవగా కీపర్ రిషబ్ పంత్ దాన్ని అందుకున్నాడు. దీంతో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. 

విండీస్ తో జరుగుతున్న మొదటి టీ20లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. మొదటి  ఓవర్లోనే సుందర్ మొదటి వికెట్ పడగొట్టగా ఆ తర్వాతి ఓవర్లోను భువనేశ్వర్ మరో వికెట్  పడగొట్టాడు.  పరుగుల  ఖాతా తెరవకముందే లూయిస్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో  విండీస్ కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  

టీమిండియా యువ  బౌలర్ వాషింగ్టన్ సుందర్ మొదటి ఓవర్లోనే అద్భతం చేశాడు. మొదటి ఓవర్ రెండో బంతికే విండీస్ ఓపెనర్ క్యాంప్ బెల్ భారీ షాట్ కు ప్రయత్నించి పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌండరీపై పాండ్యా ఆ క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే విండీస్ మొదటి వికెట్  కోల్పోయింది. 

ప్లోరిడా వేదికన టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరగనున్న సమరానికి సర్వం సిద్దమయ్యింది. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న మొదటి  టీ20 మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను టీమిండియా గెలిచింది. దీంతో కెప్టెన్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి విండీస్ మొదట బ్యాంటింగ్ కు దిగనుంది. ఆ తర్వాతే కోహ్లీసేన లక్ష్యచేధన కోసం బ్యాటింగ్ చేపట్టనుంది.

ఈ  మ్యాచ్ ద్వారా భారత్ కు చెందిన యువ ఆటగాడు నవదీప్ సైనీ అంతర్జాతీయ క్రికెట్ ను ఆరంభిస్తున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కింది. అయితే  రాహుల్ చాహర్, దీపక్ చాహర్, కెఎల్ రాహుల్,  శ్రేయార్ అయ్యర్ లకు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు.  

ఇక వెస్టిండిస్  విషయానికి  వస్తే ఆ జట్టులో నుండి ఇప్పటికే రస్సెల్ గాయంతో వైదొలిగిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ఎంపికైన జాసన్ మహ్మద్, కేరీ పైరే, బ్రాంబల్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కలేదు. 

తుది జట్లు:

టీమిండియా:

శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ

విండీస్:

క్యాంప్ బెల్, హెట్మెయర్, లూయిస్, పూరన్, పొలార్డ్, పోవెల్, బ్రాత్ వైట్, నరైన్, కాట్రెల్, పాల్, థామస్ 

Follow Us:
Download App:
  • android
  • ios