ఫిబ్రవరి 24 నుంచి ఇండియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్... ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగించుకుని నేరుగా భారత్‌కి రానున్న లంక జట్టు..
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లిన భారత జట్టు... మరో మూడు రోజుల్లో శ్రీలంకతో కలిసి స్వదేశంతో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే ఇండియా, శ్రీలంక టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. దస్సున్ శనక కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టూర్‌కి, చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్ ఆడిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు. సీనియర్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండోతో పాటు నువాన్ తుశార, రమేశ్ మెండీస్... ఆసీస్ టూర్ నుంచి స్వదేశానికి వెళ్తుంటే, మిగిలిన జట్టు భారత పర్యటనకు రానుంది..
భారత్‌తో టీ20 సిరీస్‌కి శ్రీలంక జట్టు ఇది: దస్సున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, ధనుష్క గుణతిలక, కమిల్ మిశారా, జనిత్ లియనాగే, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లహీరు కుమార, బినుర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, జెఫ్రే వాందేర్సే, ప్రవీణ్ జయవిక్రమ, ఏసియన్ డానియల్...
రెండు రోజుల క్రితమే శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు జట్లను ప్రకటించారు బీసీసీఐ సెలక్టర్లు... న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నుంచి వరుస సిరీస్‌లు ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...
అలాగే సౌతాఫ్రికా టూర్‌తో విండీస్ సిరీస్‌లోనూ పాల్గొన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి కూడా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ ఆడడం లేదు... అలాగే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, గాయం నుంచి కోలుకోని కెఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ నుంచి రెస్ట్ కల్పించింది బీసీసీఐ...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టీ20 సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం దక్కింది... శ్రీలంక టూర్ తర్వాత కనిపించని భారత సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, మరోసారి లంక సిరీస్ ద్వారా భారత జట్టులో కనిపించబోతున్నాడు...
శ్రీలంకతో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్
