భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు నిలబడలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు అలౌట్ అయిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది.

నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి మార్కరమ్ ఎల్బీగా వెనుదిరిగాడు.

దీంతో ప్రత్యర్థి జట్టులో కలవరం మొదలైంది. కొద్దిసేపటికే డిబ్రుయిన్‌ను ఉమేశ్ శర్మ బోల్తా కొట్టించడంతో సఫారీలు రెండో వికెట్‌ను కోల్పోయారు. ప్రస్తుతం డియాన్ ఎల్గర్ 33, కెప్టెన్ డుప్లెసిస్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దక్షిణాఫ్రికా.. భారత్ కంటే ఇంకా 277 పరుగుల వెనుకే ఉంది. చేతిలో 8 వికెట్లే ఉండటం.. టీమిండియ బౌలర్ల జోరు చూస్తుంటే ఫలితం ఆదివారమే తేలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.