India vs South Africa 1st Test: బాక్సింగ్ డే టెస్టుకు వర్షం దెబ్బ‌.. ఆట సాగేనా..?

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలి రెండు రోజుల్లో వర్షం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం వ‌ర్షం కారణంగా టాస్ ఆల‌స్యం కానుంది.
 

India vs South Africa 1st Test: Rain hits the Boxing Day Test ; toss is delayed bad weather, rain, will the game go on? RMA

India vs South Africa, 1st Test: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్ ప్రొటీస్ జ‌ట్టుతో రెండు టెస్టు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. డిసెంబర్ 26న సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్, ప్రొటీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే, తొలి టెస్టుకు వ‌ర్షం దెబ్బ ప‌డింది. సెంచూరియ‌న్ లో రాత్రి భారీగా కురిసిన వ‌ర్షం, గ్రౌండ్ త‌డిగా ఉండ‌టంతో టాస్ ఆల‌స్యం అయింది. పిచ్‌పై ప‌లు చోట్ల త‌డి మ‌రి ఎక్కువ‌గా ఉండ‌టంతో హెయిర్-డ్రైయర్ ఉపయోగించి ఎండబెట్టడం చేస్తున్నారు. ప్ర‌స్తుత పిచ్ ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే టాస్ గెలిచిన జ‌ట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతాయి.  ఎందుకంటే ఇది కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ కష్టమవుతుందని స‌మాచారం. 

ఇదిలావుండ‌గా, వ‌న్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత తిరిగొచ్చిన రోహిత్ శర్మ సెంచూరియన్ లోని సూపర్స్ స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా సారథ్యంలో ఇప్పుడు పూర్తి బలంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టుతో రోహిత్ సారథ్యంలోని భారత్ కు గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే, రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా జట్టులోని అనేక మంది అనుభవజ్ఞులు తిరిగి రావడంతో భారత జట్టు ప్రోటీస్ పై పైచేయి సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. అయితే, చీలమండ గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ, సిరీస్ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్ బ్యాట‌ర్ ఇషాన్ కిషన్, వేలి గాయంతో దూరమైన రుతురాజ్ గైక్వాడ్ సహా పలువురు కీలక ఆటగాళ్లను భారత జట్టు ఈ సిరీస్ నుంచి కోల్పోయింది.

India vs South Africa, 1st Test: బాక్సింగ్ డే టెస్టు.. అలా అయితే స‌రికొత్త చ‌రిత్రే.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios