ముగిసిన తొలి రోజు ఆట .. భారత్‌పై సఫారీలదే పైచేయి , కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం

సెంచూరియన్ గ్రౌండ్‌లో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓటర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 

India vs South Africa 1st Test Day : Rain forces early stumps on Day 1 in Centurion , team India 208/8 against SA ksp

సెంచూరియన్ గ్రౌండ్‌లో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓటర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజుల్ కేఎల్ రాహుల్ , సిరాజ్ వున్నారు. భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన నాటి నుంచి సఫారీ బౌలర్లు .. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. యశస్వి జైశ్వాల్ (17), రోహిత్ శర్మ (5), గిల్ (2) తీవ్రంగా నిరాశ పరిచారు. విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31) పరుగులతో పర్వాలేదనిపించారు. 

భారత ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేఎల్ రాహుల్ (70) గురించే . సహచరులంతా వెనుదిరుగుతున్నప్పటికీ రాహుల్ మాత్రం పాతుకుపోయాడు. ఆచితూచి ఆడుతూ.. జట్టు స్కోరు 200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాపై రాహుల్‌కిది 2వ అర్ధ సెంచరీ. ఓవరాల్‌గా ఆయన కెరీర్‌లో అది 14వ అర్ధసెంచరీ. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ 52వ ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా 4, 6 బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రాహుల్ తన జోరు కొనసాగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5, బర్గర్ 2,  జన్‌సేన్ 1 వికెట్ పడగొట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios