Asianet News TeluguAsianet News Telugu

హాఫ్ సెంచరీ చేసి అవుటైన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్... సౌతాఫ్రికాతో మొదటి వన్డేలో ఆ ఇద్దరిపైనే...

INDvsSA 1st ODI: 12 పరుగులకే కెప్టెన్ కెఎల్ రాహుల్ అవుట్... 79 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, 51 పరుగులకి విరాట్ కోహ్లీ అవుట్...

India vs South Africa 1st ODI: Virat Kohli, Shikhar Dhawan goes after half centuries, Shreyas Iyer
Author
India, First Published Jan 19, 2022, 8:27 PM IST

INDvsSA 1st ODI:  సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు 152 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 145 పరుగులు కావాల్సి ఉండగా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లు రాణించడంపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది.

వన్డే సారథిగా మొదటి మ్యాచ్ ఆడుతున్న కెఎల్ రాహుల్ 17 బంతుల్లో 12 పరుగులు చేసిన మార్క్‌రమ్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

84 బంతుల్లో 10 ఫోర్లతో 79 పరుగులు చేసిన శిఖర్ ధావన్, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ...  ఆ తర్వాత రెండు బంతులకే అవుట్ అయ్యాడు...

63 బంతుల్లో 3 ఫోర్లతో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, షంసీ బౌలింగ్‌లో భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 152 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, టీమిండియా ముందు 297 భారీ లక్ష్యాన్ని పెట్టింది. ప్రారంభంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

జన్నేమెన్ మలాన్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

11 బంతుల్లో 4 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌, వెంకటేశ్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రోకి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

ఈ దశలో రస్సీ వాన్ దేర్ దుస్సేన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న తెంబ భవుమా... టీమిండియాపై వన్డేల్లో సెంచరీ చేసిన ఐదో సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఏబీ డివిల్లియర్స్, భారత జట్టుపై వన్డేల్లో నాలుగు సెంచరీలు చేయగా, గ్రేమ్ స్మిత్, జాక్వస్ కలీస్, ఫాఫ్ డుప్లిసిస్ తలా ఓ చెరో సెంచరీ చేశారు...

ఓవరాల్‌గా వన్డేల్లో సెంచరీ చేసిన ఏడో సౌతాఫ్రికా కెప్టెన్ భవుమా. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఒక్కడే భారత జట్టుపై వన్డేల్లో కెప్టెన్‌గా సెంచరీ చేయలేకపోయాడు...

టీమిండియాపై వన్డేల్లో సౌతాఫ్రికాకి నాలుగో వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం.. ఇంకతుముందు 2013లో క్వింటన్ డి కాక్, ఏబీ డివిల్లియర్స్ కలిసి జోడించిన 171 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది భవుమా, దుస్సేన్ జోడీ...

రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 83 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. నాలుగో వికెట్‌కి 184 బంతుల్లో 204 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన తర్వాత భవుమాను పెవిలియన్ చేర్చాడు బుమ్రా... టీమిండియాపై సౌతాఫ్రికాకి ఓవరాల్‌గా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం...

143 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేసిన భవుమా, 49వ ఓవర్ మొదటి బంతికి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 96 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 పరుగులు చేసిన వాన్ డేర్ దుస్సేన్ నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 64 పరుగులివ్వగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. యజ్వేంద్ర చాహాల్‌కి కూడా వికెట్ దక్కలేదు.

జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్... ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌కి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios