Asianet News TeluguAsianet News Telugu

తొలి వన్డేలో టీమిండియా ఓటమి... మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్, కెప్టెన్‌ కెఎల్ రాహుల్‌కి...

విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలు... మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ అట్టర్ ఫ్లాప్... ఒంటరి పోరాటం చేసిన శార్దూల్ ఠాకూర్...

India vs South Africa 1st ODI: Team India lost, Middle order batsman Shreyas Iyer, Rishabh Pant, Shardul thakur
Author
India, First Published Jan 19, 2022, 10:03 PM IST

టీమిండియా భావి కెప్టెన్‌గా భావిస్తున్న కెఎల్ రాహుల్‌కి వన్డే ఫార్మాట్‌లో కూడా శుభారంభం దక్కలేదు. ఓటమి ఎరుగుని జోహన్‌బర్గ్‌లో టెస్టు ఓడిన కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ఆరంభించింది. 297 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా 30 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది... 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులకి పరిమితమైంది భారత జట్టు.

వన్డే సారథిగా మొదటి మ్యాచ్ ఆడుతున్న కెఎల్ రాహుల్ 17 బంతుల్లో 12 పరుగులు చేసిన మార్క్‌రమ్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

84 బంతుల్లో 10 ఫోర్లతో 79 పరుగులు చేసిన శిఖర్ ధావన్, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ...  ఆ తర్వాత రెండు బంతులకే అవుట్ అయ్యాడు...

63 బంతుల్లో 3 ఫోర్లతో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, షంసీ బౌలింగ్‌లో భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 152 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఒకానొక దశలో 138/1 స్కోరుతో ఉన్న భారత జట్టు, 50 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది. 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసిన రిషబ్ పంత్ వెంటవెంటనే అవుట్ అయ్యారు...

ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 2 పరుగులు చేసి లుంగి ఇంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... అప్పటికే రన్‌రేట్ పెరిగిపోవడంతో విజయంపై ఆశలు వదులుకుంది టీమిండియా...

భువనేశ్వర్ కుమార్ 11 బంతుల్లో  4 పరుగులు చేసి అవుట్ కాగా  శార్దూల్ ఠాకూర్ ఒక్కడూ ఆఖర్లో ఒంటరి పోరాటం చేసి ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించగలిగాడు. 

జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌లకు వన్డే ఫార్మాట్‌లో ఇవే అత్యధిక స్కోర్లు కావడం విశేషం. శార్దూల్ ఠాకూర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేయగా, జస్ప్రిత్ బుమ్రా 23 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించడం మరో విశేషం.


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, టీమిండియా ముందు 297 భారీ లక్ష్యాన్ని పెట్టింది. ప్రారంభంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

జన్నేమెన్ మలాన్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

11 బంతుల్లో 4 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌, వెంకటేశ్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రోకి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...
 
రస్సీ వాన్ దేర్ దుస్సేన్, కెప్టెన్ భువమా కలిసి నాలుగో వికెట్‌కి 184 బంతుల్లో 204 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు... టీమిండియాపై సౌతాఫ్రికాకి ఓవరాల్‌గా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం...

143 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేసిన భవుమా, 49వ ఓవర్ మొదటి బంతికి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 96 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 పరుగులు చేసిన వాన్ డేర్ దుస్సేన్ నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 64 పరుగులివ్వగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. యజ్వేంద్ర చాహాల్‌కి కూడా వికెట్ దక్కలేదు.

జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్... ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌కి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios