ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌‌తో వరుణుడి దోబూచులాట... రేపటికి వాయిదా..

India vs Pakistan: వర్షం, వెట్ అవుట్ ఫీల్డ్‌తో రేపటికి వాయిదా పడిన మ్యాచ్...  రిజర్వు డేన తిరిగి ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్..

 

India vs Pakistan match interrupted by rain, may postponed to reserve day tomorrow CRA

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా  - పాకిస్తాన్ మ్యాచ్‌‌ రిజర్వు డేకి వాయిదా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది.  దాదాపు రెండు గంటల విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభం అవుతుందనుకుంటుండగా మళ్లీ చినుకులతో వాన మొదలైంది... భారీ వర్షం కురిసి ఆగిపోయినా, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆట తిరిగి ప్రారంభమయ్యేందుకు చాలా సమయం తీసుకున్నారు అంపైర్లు. 

4:53 నిమిషాలకు వర్షం అంతరాయంతో ఆట ఆగింది. 5:55 నిమిషాలకు వర్షం నిలిచింది. అయితే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో 7 గంటలకు, 7:30 నిమిషాలకు, 8 గంటలకు, 8 గంటల 30 నిమిషాలకు పిచ్‌ని పరిశీలించారు అంపైర్లు. చిత్తడిగా మారిన పిచ్‌ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది, ఫ్యాన్స్‌ని తీసుకొచ్చారు..

ఎట్టకేలకు 9 గంటలకు ఆట తిరిగి మొదలవుతుందని భావించినా మరోసారి చినుకులు కురిశాయి. దీంతో ఆటను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈరోజు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఆట తిరిగి మొదలవుతుంది. వర్షం అంతరాయం లేకపోతే పూర్తిగా 50 ఓవర్ల మ్యాచ్‌ని చూడొచ్చు. 

రేపు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే భారత జట్టు, సెప్టెంబర్ 12న శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. వరుసగా మూడు రోజుల పాటు టీమిండియా ప్లేయర్లు మ్యాచ్‌ ఆడబోతున్నారు. 

వాన వల్ల ఆట నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది భారత జట్టు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు. 

శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులే చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 6, 4 బాది 19 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షాదబ్ ఖాన్ ఖాన్ ఓవర్‌లో 6, 4 బాది 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..  పాకిస్తాన్‌పై ఆసియా కప్‌‌లో రోహిత్‌కి ఇది ఆరో హాఫ్ సెంచరీ..

తొలి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా. 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పహీం ఆష్రఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...  ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు..

52 బంతుల్లో 10 ఫోర్లతో 58 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 121/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయి 123/2 స్థితికి చేరుకుంది.  కెఎల్ రాహుల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 8 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios