Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ : ప్రపంచ క్రికెట్‌లోనే హార్దిక్ పాండ్యా అత్యుత్తమ ఆల్ రౌండర్.. వసీం అక్రమ్ ప్రశంసలు..

హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటిలోనూ నిలకడ కనబరుస్తున్నాడని, దీనివల్లే వైట్-బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా మారాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. ఆదివారం పాకిస్థాన్‌పై భారత్‌ విజయంలో హార్దిక్ 33 పరుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు.

India vs Pakistan Asia Cup : Hardik Pandya is the best all-rounder in world cricket, says Wasim Akram
Author
First Published Aug 29, 2022, 10:28 AM IST

ఆసియా కప్ 2022 : ఆదివారం, దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2022 భారత్ వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్ లో భారత్ గెలుపు మీద పాకీస్తానీ క్రికెటర్ వసీం అక్రం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మాట్లడుతూ.. పాకిస్థాన్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన దాంట్లో ఆల్‌రౌండర్ గా మెరిసిన హార్దిక్ పాండ్యా తనను చాలా ఆకట్టుకున్నాడని అన్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా అత్యుత్తమ ఆల్ రౌండర్ అని తాను నమ్ముతున్నానని పాకిస్తానీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసించాడు. భారత క్రికెట్ జట్టుకు హార్థిక్ పాండ్యా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో సహకారం అందించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు.

దుబాయ్‌లో పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయంలో హార్దిక్ 17 బంతుల్లో అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసి, 3 వికెట్లు తీసుకున్నాడు. దీనిమీద వసీం అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ బౌలింగ్ లో ముందుండి నడిపించాడు, క్రీజ్ లో బాగా సెట్ అయిన మహ్మద్ రిజ్వాన్ సహా 3 కీలక వికెట్లు తీశాడు.

మిడిల్-ఓవర్లలో ఫాస్ట్ బౌలింగ్ ఇంటెన్స్ స్పెల్‌లో, హార్దిక్ దుబాయ్ పిచ్‌పై బౌన్స్‌ను బాగా ఉపయోగించాడు, బౌన్సర్‌లను బౌల్ చేసిన తీరుతో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లను ఆశ్చర్యపరిచాడు. హార్దిక్, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు ఉత్కంఠభరితమైన ఆటతీరుతో పాకిస్థాన్‌ను భారత్ 147 పరుగులకే ఆలౌట్ చేయగలిగింది.

ఆసియా కప్ లో పాక్ పై భారత్ విజయం.. అద్భుత ప్రదర్శన అంటూ మోదీ ప్రశంసలు..

"ప్రస్తుతం అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. ఈ విషయం అతనికి కూడా తెలుసని నేను భావిస్తున్నాను. దాని ప్రకారమే హార్ధిక్ పనిచేస్తాడు. దానికి తగ్గట్టుగానే అతని మైండ్ సెట్ ఉంటుంది. అతను 140 కి.మీ-ప్లస్ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కూడా అదే తీరు. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టులో చాలా ముఖ్యమైన సభ్యుడు”అని వసీం అక్రమ్ ఆదివారం స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

“నా అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ అతను. హార్థిక్ బ్యాటింగ్ చేసే విధానం ఆండ్రీ రస్సెల్ కంటే మెరుగైనది. మనకున్న ఆల్ రౌండర్లందరి కంటే మైరుగైనవాడు. స్థిరంగా ఉంటాడు. ఎలక్ట్రిఫైయింగ్ ఫీల్డర్. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకడు” అని ప్రశంసల వర్షం కురిపించాడు. 

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను భారత్ కోల్పోయిన తర్వాత.. హార్దిక్ పాండ్యా.. రవీంద్ర జడేజాతో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరచాడు. హార్దిక్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆడాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉన్నాడు, చివరి ఓవర్‌లో భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

హార్థిక్ పాండ్యాపై ఇర్ఫాన్ ప్రశంసలు...
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ హార్దిక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఆల్‌రౌండర్ బంతిని క్లీన్‌గా ఎలా స్ట్రైక్ చేయాలో బాగా తెలుసుకున్నాడు. దీంట్లో పూర్తి సామర్థ్యాన్ని సాధించాడు. "ప్రారంభంలో, కొంత సమయం తీసుకున్నాడు. పాకిస్థాన్ తన ఆర్క్‌లో బౌలింగ్ చేయలేదు. కానీ అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు, అతను ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఏ బౌలర్‌నైనా ఎదుర్కోగలడు.

‘‘గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత హార్థిక్ కు ఇప్పుడు లభించిన ఆత్మవిశ్వాసం అది. తనకి గొప్ప హిట్టింగ్ పవర్ ఉంది. ఎబిలిటీ ఎప్పుడూ ఉండేది కానీ ఇప్పుడు రెగ్యులర్ గా పర్ఫామ్ చేయడం ప్రారంభించాడు. ఫిట్‌గా ఉన్నాడు. గంటకు 140కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు’ అంటూ పఠాన్ చెప్పుకొచ్చాడు. 

హార్దిక్ పాండ్యా IPL 2022లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం  వహించినప్పటి నుండి, కాంపిటీటివ్ యాక్షన్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రికరింగ్ బ్యాక్ ఇష్యూస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, హార్దిక్ వైట్-బాల్ టీమ్ కు మంచి బ్యాలెన్స్ ను అందిస్తున్నాడు. అది ఆదివారం భారత చిరకాల ప్రత్యర్థులతో జరిగిన ఆల్ రౌండ్ షోలో స్పష్టంగా కనిపించింది అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios