రోహిత్‌ 119 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో కోహ్లి ఉండగా, మూడో స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నవంబర్‌21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 

టీ20 క్రికెట్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 56 పరుగులు చేసిన రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. అంతకముందు టీ20ల్లో విరాట్‌ కోహ్లి 29 సార్లు యాభైకు పైగా పరుగులు చేయగా, తాజాగా రోహిత్‌ 30 సార్లు సాధించి అతడి రికార్డును అధిగమించాడు.

రోహిత్‌ 119 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో కోహ్లి ఉండగా, మూడో స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నవంబర్‌21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

Also Read: ప్లేయర్లను పక్కనబెట్టడం చాలా తేలిక, కానీ ఆ ఇద్దరూ... టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

కాగా.. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావించినా, టీ20 కెప్టెన్సీ కోసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు రోహిత్ శర్మ. టీ20 కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్.

31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చసిన రోహిత్ శర్మ, టీ20ల్లో 26వ హాఫ్ సెంచరీ, 30వ 50+ స్కోరు నమోదుచేశాడు. రోహిత్‌కి టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక 50+ పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ (29 హాఫ్ సెంచరీలు) రికార్డును అధిగమించి, టాప్‌లోకి దూసుకెళ్లాడు రోహిత్ శర్మ.

Also Read: బిగ్‌బాష్ షోలోకి క్రికెటర్ సురేష్ రైనా... ఆ ఒక్క కండీషన్‌తో ‘రియాలిటీ షో’లోకి వెళ్తానంటూ...

మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాది, టీ20ల్లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ (161 సిక్సర్లు) తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు... క్రిస్ గేల్ 124 అంతర్జాతీయ టీ20 సిక్సర్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ 48 పరుగుల స్కోరుతో మొత్తంగా 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రెండుసార్లు 150+ పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2017లో తాత్కాలిక కెప్టెన్‌గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 162 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా ఆడిన ఏ సిరీస్‌లోనూ రోహిత్ 150+ స్కోరు చేయకపోవడం విశేషం.