న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో పోరాడే భారత జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్ పై జరిగే రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జట్టును ఎంపిక చేసే విషయంలో హార్డిక్ పాండ్యాను దృష్టిలో పెట్టుకుని జాప్యం చేస్తూ వచ్చారు. 

హార్డిక్ పాండ్యాకు స్థానం కల్పించే విషయంలో మేనేజ్ మెంట్ నిరీక్షణ ఫలించలేదు. కివీస్ తో జరిగే టెస్టు సిరీస్ కు హార్డిక్ పాండ్యా ఆందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారంనాడు ఓ ప్రకటన విడుదల చేసింది. 

Also Read: లండన్ లో హార్డిక్ పాండ్యాకు లోయర్ బ్యాక్ సర్జరీ

సర్జరీ జరిగిన తర్వాత ఎన్ సీఏ ఫిజియో ఆశిక్ కౌశిక్ తో కలిసి పాండ్యా మెడికల్ రివ్యూ కోసం లండన్ వెళ్లాడు. కానీ అప్పుడే మ్యాచులు ఆడడానికి అవకాశం లేదని డాక్టర్ జేమ్స్ అలీబోన్ తెలిపారు. దాంతో పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించే వరకు ఎన్ సిే ఆటగాళ్ల పునరావాస శిబిరంలో ఉంటాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో హార్డిక్ పాండ్యా చివరిసారిగా ఆడాడు. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని గాయానికి సర్జరీ కూడా జరిగింది. ఇటీవలే అతను కోలుకున్నాడు. దాంతో భారత్ ఏ జట్టు తరఫున కివీస్ పర్యటనకు వెళ్తాడని భావించారు కానీ చివరి నిమిషంలో ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో దానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 

Also Read: నటాషాతో నిశ్చితార్థం: హార్దిక్ పాండ్యా పేరెంట్స్ షాక్, కానీ......

దాంతో హార్డిక్ పాండ్యా స్థానంలో విజయ్ శంకర్ ను భారత ఏ జట్టుకు ఎంపిక చేశారు న్యూజిలాండ్ పై భారత సీనియర్ జట్టు రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. అప్పటికి హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధిస్తాడని భావించారు. కానీ అతనికి ఇంకా విశ్రాంతి అవసరమని తేల్చడంతో జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేకుండా పోయింది.