Asianet News TeluguAsianet News Telugu

తొలి వన్డే: పరువు కోసం కివీస్... గెలవటం అలవాటైన భారత్

సొంతగడ్డపై తొలిసారి భారత్‌కు టీ20 సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌, మరో వన్డే సిరీస్‌ వదులుకునేందుకు మాత్రం అంత ఈజీ గా ససేమిరా ఒప్పుకోదు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీఇచ్చేందుకు ఆతిథ్య జట్టు సిద్ధమవుతోంది. 

India vs New Zealand 1st ODI: match preview playing eleven toss and live updates
Author
Hamilton, First Published Feb 5, 2020, 7:19 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఫేవరెట్ గా భావించిన కివీస్ టి 20 సిరీస్ లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఏకంగా స్వదేశంలో టి 20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. టి 20 ప్రపంచ కప్ కి ముందు ఇలా టి 20 సిరీస్ లో ఓడిపోవడం అందునా స్వదేశంలో ఓటమి చెందడం న్యూజిలాండ్ టీం కి పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. 

2019 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ తర్వాత న్యూజిలాండ్‌ తొలి వన్డే ఆడబోతుంది. ఆ చేదు జ్ఞాపకం తరువాత తొలి 50 వర్ల ఫార్మాట్ మ్యాచుకు సన్నద్దమయింది. నవంబర్‌ 25, 2019 తర్వాత కివీస్ టీం ఏ ఫార్మాట్‌లోనూ ఓ గెలుపు చూడలేదు. 

ఆఖరు వన్డే చేదు జ్ఞాపకాలు ఓవైపు, వరుస ఓటముల నైరాశ్యం మరోవైపు న్యూజిలాండ్‌ను మానసికంగా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 

సొంతగడ్డపై తొలిసారి భారత్‌కు టీ20 సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌, మరో వన్డే సిరీస్‌ వదులుకునేందుకు మాత్రం అంత ఈజీ గా ససేమిరా ఒప్పుకోదు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీఇచ్చేందుకు ఆతిథ్య జట్టు సిద్ధమవుతోంది. 

5-0 టీ20 సిరీస్‌ విజయంతో న్యూజిలాండ్‌ పర్యటనను భారత్‌ మెగా హిట్‌తో మొదలెట్టింది. టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌ సేవలు కోల్పోయినా, ఫామ్‌లో ఉన్న కుర్రాళ్లు భారత్‌ను వన్డే సిరీస్‌లోనూ ఫేవరెట్‌గా నిలుపుతున్నారు. 

మరోసారి హామిల్టన్‌ లోని సెడాన్‌ పార్క్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ నేడు తొలి వన్డేలో తలపు-ఆడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ నేటి ఉదయం 7.30 కు ప్రారంభమవనుంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

భారత టీంలో రోహిత్‌ శర్మ లేడు. అటు కివీస్ జట్టు వైపు కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. ఇరు శిబిరాలు సూపర్‌ స్టార్స్‌ను కోల్పోయినా.. హామిల్టన్‌ వన్డే వన్నె ఏమాత్రం తగ్గటం లేదు. 

ప్రతిభావంతులైన ఇద్దరు యువ బ్యాట్స్‌మెన్‌ భారత్‌ నుంచి ఆరంగ్రేటం చేయనుండగా, మంచి ఫామ్‌ చాటుకున్న యువ క్రికెటర్‌ కెప్టెన్‌ కేన్‌ స్థానంలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. 

ప్రతి మ్యాచ్ కూడా ఒక  సినిమా క్లైమాక్స్ ని తలపిస్తూ, ఊహించని మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించిన టీ20 సమరం తరహాలోనే వన్డే సిరీస్ కూడా సాగనుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

వన్డే సవాల్‌కు భారత్‌, న్యూజిలాండ్‌ లు రంకెలేస్తూ సై అంటున్నాయి. టీం ఇండియా మరో సిరీస్‌పై కన్నేసిన వేళ, భారత జట్టును నిలువరించేందుకు ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఏం చేయనుందో చూడాలి.

యువ ఓపెనర్ల ఆరంగేట్రం.... 

లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో భారత్‌ విజయాల్లో ముఖ్య భూమిక వహించిన రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు న్యూజిలాండ్‌ వన్డేలకు దూరమయ్యారు. ఇద్దరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన టీమ్‌ ఇండియా నేడు హామిల్టన్‌లో కొత్త జంటతో ఇన్నింగ్స్‌ ఆరంభించనుంది. 

కెఎల్‌ రాహుల్‌ రూపంలో మరో ఓపెనర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ భారత్‌ ఇద్దరు కొత్త ఓపెనర్లవైపే మొగ్గుచూపుతోంది. వికెట్‌ కీపర్‌గా కెఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో కుదురుకునేందుకు కోహ్లిసేన తగిన సమయం ఇవ్వాలని భావిస్తోంది. 

టెస్టుల్లో ఓపెనర్లుగా సత్తా చాటిన షా, అగర్వాల్‌లు వన్డేల్లోనూ ఆ మార్క్‌ చూపించాలని ఎదురుచూస్తున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌ ఫామ్‌లో ఉన్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే ఎక్కువ సమయం క్రీజులో గడపాలని ఆలోచిస్తున్నాడు. 

పరిస్థితులు అనుకూలిస్తే మనీశ్‌ పాండేకు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగంలో చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. 

చివరి రెండు టీ20లకు విశ్రాంతి పొందిన మహ్మద్‌ షమి తొలి వన్డేకు తిరిగి రానున్నాడు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, షార్దుల్‌ ఠాకూర్‌లతో కలిసి షమి బౌలింగ్‌ చేయనున్నాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా తుది జట్టులో కొనసాగనున్నాడు.

కేన్‌ అవుట్... బ్లండెల్ ఇన్ 

న్యూజిలాండ్‌ గాయాల జాబితా పెరిగిపోతుంది. ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫెర్గుసన్‌, మాట్‌ హెన్రీల సరసన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా చేరిపోయాడు. మూడో టీ20లో భుజం గాయానికి గురైన కేన్‌ విలియమ్సన్‌ తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. 

గాయం తీవ్రత తక్కువే అయినా, ముందు జాగ్రత్తగా విలియమ్సన్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో, ఇండియా-ఏపై శతకాలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న మార్క్‌ చాప్‌మ్యాన్‌ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 

కానీ చివరి నిమిషంలో అతని బదులుగా టామ్ బ్లండెల్ చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. మార్టిన్‌ గప్టిల్‌కు తోడుగా హెన్రీ నికోల్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. రాస్‌ టేలర్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్‌ డీ గ్రాండ్ హోమ్ నుంచి న్యూజిలాండ్‌ బాధ్యతాయుత ప్రదర్శన ఆశిస్తోంది. 

టీ20 సిరీస్‌లో భారత బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేసిన సీనియర్ పేసర్ టిమ్‌ సౌథికి విశ్రాంతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. స్కాట్‌, బెనెట్‌, కైల్‌లు పేస్‌ విభాగంలో, మిచెల్‌ శాంట్నర్‌ స్పిన్నర్‌గా తుది జట్టులో ఉండనున్నారు.

పిచ్‌, వెదర్ కండిషన్స్.... 

మూడో టీ20కి సెడాన్‌ పార్క్‌లో వినియోగించిన పిచ్‌ మిగిలిన కివీస్ మైదానాల్లలా మరీ ఫ్లాట్‌గా లేదు. నేటి వన్డేకు సైతం పిచ్‌ అలానే కొన్ని వేరియేషన్స్ తో కూడిన స్పందనను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 

300 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే సత్తా ఇరు జట్ల బౌలర్లకు ఉంది. తొలి వన్డేకు ఆహ్లాదకర వాతావరణం ఎదురుచూస్తోంది. భారీ స్కోర్లు నమోదు కాకపోయినప్పటికీ.... పోటీతత్వ క్రికెట్‌ అభిమానులను అలరించనుంది. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ చేసేందుకు మొగ్గుచూపనుంది. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

భారత్‌ : మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, షార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్ యాదవ్, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా. 

న్యూజిలాండ్‌ : గప్టిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్ బ్లండెల్, రాస్‌ టేలర్‌, టామ్‌ లేథమ్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌ హోమ్, జిమ్మీ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, హమిశ్‌ బెనెట్‌, ఇష్ సోది.

Follow Us:
Download App:
  • android
  • ios