రనప్  ఎక్కువ గా తీసుకోకపోయినప్పటికీ బౌలింగ్ లో లయను అందిపుచ్చుకోవడం మాత్రం అందరికీ ఆనందాన్ని నింపింది. మ్యాచ్ అనంతరం బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ అదిరిపోయింది. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ ను సునాయాసంగా గెలిచి, ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా కూడా సునాయాసంగానే దానిని చేధించింది. మొదట చాలా ఈజీగా గెలుస్తారు అనిపించినా, మధ్యలో జైశ్వాల్, తిలక్ వర్మలు వెంట వెంటనే పెవీలియన్ కి చేరడంతో కాస్త ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ, చివరకు విజయం మాత్రం మనల్నే 

దాదాపు సంవత్సరం తర్వాత జట్టులోకి వచ్చిన భారత కెప్టెన్ బుమ్రా మునుపటి ఫామ్ ను అందిపుచ్చుకున్నట్లే ఉంది. రనప్ ఎక్కువ గా తీసుకోకపోయినప్పటికీ బౌలింగ్ లో లయను అందిపుచ్చుకోవడం మాత్రం అందరికీ ఆనందాన్ని నింపింది. మ్యాచ్ అనంతరం బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

జాతీయ క్రికెట్ అకాడమీలో చాలా సెషన్లు ప్రాక్రీస్ చేశానన్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలవడం ఆనందంగా ఉందన్నాడు. అయితే, ఇందులో తనకేమీ కొత్తగా అనిపించలేదన్నాడు. ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో స్వింగ్ కు అనుకూలంగా ఉందని, అయితే, వర్షం కారణంగా పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయన్నారు. అయినా, చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. 

ఐర్లాండ్ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కోలుకొని మ్యాచ్ లను ఆడుతోందన్నారు. వారు అద్భుతంగా ఆడారన్నారు. తాము గెలిచినప్పటికీ కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తమ జట్టులో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఐపీఎల్ లో ఆడటం వల్ల ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందన్నారు. అన్ని విషయాల్లోనూ ఇలానే విజయం సాధిస్తామన్నారు. ఇక, ఈ మ్యాచ్ లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం గమనార్హం.