IND vs ENG: అతనిలాంటి ఆటగాడు ప్రపంచంలోనే లేడు... అశ్విన్‌పై రోహిత్ శ‌ర్మ ప్రశంసలు

India vs England : ధర్మశాలలో గురువారం నుంచి భార‌త్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు ప్రారంభం కానుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుని 3-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉండ‌గా, 100 టెస్టుల ఆడిన ఆటగాళ్ల క్లబ్‌లో అశ్విన్, జానీ బెయిర్‌స్టో చేరనున్నారు.
 

India vs England: There is no player in the world like him... Rohit Sharma praises Ravichandran Ashwin RMA

Rohit Sharma praises Ashwin:భార‌త స్టార్ బౌల‌ర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంత పొగిడినా సరిపోదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అన్నాడు. తన 100వ టెస్టు మ్యాచ్‌కు ముందు అశ్విన్ పై హిట్ మ్యాన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అతను జట్టుకు నిరంతరం సహకరించి అనేక విజ‌యాలు అందించిన అరుదైన ప్రతిభగా అభివర్ణించాడు. అశ్విన్‌పై ప్రశంసలు సరిపోవనీ, అతనిలాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటార‌ని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

ధర్మశాలలో గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదో, చివరి టెస్టులో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిని పెద్ద‌గా భార‌త్ కు న‌ష్టం లేదు. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుని 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే, దీనిని 4-1తో ముగించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అలాగే, భార‌త్ స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఈ మ్యాచ్ లో ఆడితే 100 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడిన ప్లేయ‌ర్ల గ్రూప్ లో చేరుతారు.

ఒకే రాష్ట్రానికి చెందిన జట్లు ఎన్నిసార్లు రంజీ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయో తెలుసా?

ధ‌ర్మ‌శాల‌లో ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. ''100 టెస్టులు ఆడడం ఏ ఆటగాడికైనా పెద్ద అచీవ్‌మెంట్. అతను మాకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. అశ్విన్ మన కోసం చేసిన కృషికి ప్ర‌శంస‌లు ప‌రిపోవు. గత ఐదు-ఏడేళ్లలో అతని ప్రదర్శన అద్భుతమైనది. ప్రతి సిరీస్‌లో అతను తన సహకారాన్ని అందించాడు. అతనిలాంటి ఆటగాడు దొరకడం అరుదని'' పేర్కొన్నాడు.

అశ్విన్ రికార్డు స్థాయిలో ఇప్ప‌టికే 507 టెస్ట్ వికెట్లు సాధించాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసుకున్న రెండో భారత బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు. ర‌జ‌త్ ప‌టిదారు గురించి కూడా రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తావించాడు. 'రజత్ పాటిదార్‌లో చాలా సత్తా ఉంది. అతను ఆడే విధానం నాకు ఇష్టం. నేను అతన్ని ప్రతిభావంతుడైన ఆటగాడిగా చూస్తాను. మనం అతనికి మరికొంత సమయం ఇవ్వాలి' అని తెలిపాడు. అలాగే, క్లిష్ట పరిస్థితుల నుండి తిరిగి పుంజుకోవడం భారత జట్టు సామర్థ్యమే జట్టు ప్రదర్శనలో అద్భుతమైన అంశమ‌ని చెప్పాడు. ధర్మశాలలో పిచ్ బాగుంటుందని ఆశిస్తున్నామ‌నీ, ఇది సాధారణ భారత పిచ్‌లా కనిపిస్తోందన్నాడు.

చ‌రిత్ర సృష్టించ‌నున్న అశ్విన్-బెయిర్‌స్టో.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది నాలుగో సారి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios