India vs England: భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. అద్భుత‌మైన బౌలింగ్ తో కుల్దీప్ యాద‌వ్ 5 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 4 వికెట్లు తీసుకోవ‌డంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.   

India vs England: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. అద్భుతమైన బౌలింగ్ తో నిప్పులు చెరుగుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్లను చెడుగుడు ఆడుకున్నారు. తొలి రోజే ఇంగ్లాండ్ ను కుల్దీప్ యాదవ్ కుప్పకూల్చాడు. ఐదు వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 15 ఓవర్ల బౌలింగ్ లో 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించింది. కానీ, సెకండ్ సెషన్ నుంచి భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.మంచి ఫామ్ లో కనిపించిన జాక్ క్రాలీ (79 పరుగులు)ని కుల్దీప్ యదవ్ బౌల్డ్ చేశాడు. అలాగే, బెన్ డకెట్, ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ లను పెవిలియన్ కు పంపి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మరో ఎండ్ లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.

IND vs ENG: ఇద్ద‌రు స్టార్లు.. అశ్విన్ స‌రికొత్త రికార్డు !

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెన్ డకెట్ 27 పరుగులు, జోరూట్ 26 పరుగులు, జానీ బెయిర్ స్టో 29 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్టోక్స్ తో పాటు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ లు డకౌట్ అయ్యారు. కల్దీప్ తో పాటు తన 100వ టెస్టు ఆడుతున్న ఆర్ అశ్విన్,రవీంద్ర జడేజాలు బౌలింగ్ తో అదరగొట్టడంతో ఇంగ్లాండ్ కూడా ఆటలోకి రావడంతో పర్యాటకులు కేవలం ఎనిమిది పరుగులకే చివరి ఐదు వికెట్లను కోల్పోయారు.

Scroll to load tweet…

IND VS ENG: 112 ఏళ్ల తర్వాత.. స‌రికొత్త‌ చరిత్ర సృష్టించ‌నున్న రోహిత్ సేన !