India vs England : ధర్మశాలలో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ జానీ బెయిర్ స్టోల‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావ‌డం విశేషం. 

100th Test match: ధర్మశాలలో భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జ‌రుగుతోంది. టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుని 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే, దీనిని 4-1తో ముగించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ధ‌ర్మ‌శాల‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త్ స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఈ మ్యాచ్ తో త‌మ 100 టెస్టును ఆడుతున్నారు.

టెస్టు క్రికెట్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు కలిసి త‌మ 100వ టెస్టు మ్యాచ్ ఆడడం ఇది నాలుగోసారి కావ‌డం విశేషం. 2000లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్‌పై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్లు మైఖేల్ అథర్టన్, అలెక్ స్టీవర్ట్ చారిత్రాత్మక ఫీట్ సాధించడం తొలిసారి. ర‌విచంద్ర‌న్ అశ్విన్, బెయిర్‌స్టో గురువారం ప్రారంభమైన‌ భారత్ vs ఇంగ్లాండ్ తో జరిగే 5వ, చివరి టెస్టులో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వీరిద్ద‌రు ఇప్పుడు ఈ ప్ర‌త్యేక జాబితాలో చేరారు. మ‌రో విషేశం ఏమిటంటే, అలిస్ట‌ర్ కుక్- మైఖేల్ క్లార్క్ తర్వాత ప్రత్యర్థి జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో తమ 100వ టెస్టు ఆడడం ఇది రెండోసారి.

IND vs ENG: అతనిలాంటి ఆటగాడు ప్రపంచంలోనే లేడు... అశ్విన్‌పై రోహిత్ శ‌ర్మ ప్రశంసలు

భార‌త్ త‌ర‌ఫున 100+ టెస్టు మ్యాచ్ లు ఆడిన ఎలైట్ గ్రూప్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ చేరాడు. ఈ ఘనత సాధించిన 14వ భారతీయుడిగా అశ్విన్ నిలిచాడు. ఈ లిస్టులో స‌చిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), విరాట్ కోహ్లీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), చెతేశ్వర్ పుజారా (103)లు భార‌త్ త‌ర‌ఫున 100+ టెస్టు మ్యాచ్ లు ఆడారు.

Scroll to load tweet…

ఒకే రాష్ట్రానికి చెందిన జట్లు ఎన్నిసార్లు రంజీ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయో తెలుసా?