india vs england : బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల .. ముగిసిన రెండో రోజు ఆట , భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం
విశాఖపట్నంలో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో వున్నారు. మొత్తంగా భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో వుంది.
విశాఖపట్నంలో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో వున్నారు. మొత్తంగా భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో వుంది.
అంతకుముందు బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ కుప్పకూలింది. యార్కర్లలో ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుని ఇంగ్లాండ్ ను 253 పరుగులకు ఆలౌట్ చేశారు. తొలి టెస్టులో అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ పోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బాల్ కు రెండు వికెట్లు ఎగిరిపడ్డాయి. అలాగే, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో మూడు వికెట్లు తీసుకున్నాడు. బెన్ డకెట్, ఫోక్స్, రెహాన్ అహ్మద్ లను పెవిలియన్ కు పంపాడు.
ఇంగ్లాండ్ ప్లేయర్లలో జాక్ క్రాలే 76 పరుగులు, బెన్ స్టోక్స్ 47 పరుగులతో టాప్ స్కోరర్లుగా ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో (209) అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా (స్పిన్, పెస్ బౌలింగ్) అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ (29 మ్యాచ్ లు), జడేజా (32 మ్యాచ్ లు) బుమ్రా కంటే ముందున్నారు. టెస్టుల్లో 150+ వికెట్లు తీసుకున్న బౌలర్ల అత్యుత్తమ సగటులో కూడా బుమ్రా రికార్డు సృవష్టిస్తున్నాడు. ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు.
Best avg in Tests (150+ wickets)
- 16.43 సిద్ బర్న్స్
- 20.28 జస్ప్రీత్ బుమ్రా
- 20.53 అలాన్ డేవిడ్సన్
- 20.94 మాల్కం మార్షల్
- 20.97 జోయెల్ గార్నర్
- 20.99 కర్ట్లీ ఆంబ్రోస్