టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విశ్వరూపం  చూపించాడు. తన బ్యాటింగ్ ఝులిపించాడు. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి  టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జట్టు స్కోరు 432 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మయాంక్ ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. మొత్తం 28 ఫోర్లు, 8 సిక్సులతో 243 పరుగులు చేసి చెలరేగిపోయాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు. 

AlsoReadవిరాట్ కోరిక తీర్చని మయాంక్.. డబల్ కాదు, త్రిబుల్ వీడియో వైరల్...

కాగా.. ఆట ముగిసిన తర్వాత.. మయాంక్ అగర్వాల్ ని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ అంటూ మయాంక్ ని విరాట్ కోహ్లీ సంభోదించాడు. రెండోసారి డబుల్ సెంచరీ చేశాడంటూ మయాంక్ ని పరిచయం చేస్తూ.. తన ఫిట్ నెస్ లెవల్స్ గురించి ఆరా తీశాడు. 

ఓపెనర్ గా దిగి.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేశాడని.. ఫిట్ నెస్ సీక్రెట్ ఏమిటని అడగగా.. దానిని మయాంక్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. దానికి మీరు ఎప్పుడో స్టాండర్డ్ సెట్ చేశారంటూ సమాధానం ఇచ్చాడు. అనంతరం విరాట్.. మయాంక్ మైండ్ సెట్ గురించి ప్రశ్నించాడు.

 

మైండ్ సెట్ పరంగా తాను చాలా మారినట్లు మయాంక్ చెప్పాడు. ఓటమి ఎదురైనప్పుడు భయపడటం లాంటి వాటిని ఇప్పుడు వదిలేసినట్లు చెప్పాడు.అలా తనను తాను మార్చుకోవడం కారణంగానే తనకు ఎక్కువ పరుగులు చేయాలనే ఉత్సాహం ఏర్పడిందని చెప్పాడు. తాను పరుగులు చేయని సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు. అయితే.. వీలైనంత ఎక్కువ పరుగులు చేయడానికి మాత్రం తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.