టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ తర్వాత ఆ రేంజ్ లో ట్రోల్ బారిన పడిన మరో క్రికెటర్ ఖలీల్ అహ్మద్. బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టీ 20 మ్యాచుల్లోనూ ఖలీల పేలవమైన ప్రదర్శన కనపరిచాడు. తన బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టు వరస ఫోర్లు చేసుకునే అవకాశం కల్పించాడు.

తొలి టీ20లో ఖలీల్  వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకి నాలుగు ఫోర్లు సమర్పించుకున్నాడు. కాగా.. ఇప్పుడు  రెండో టీ20లో తాను వేసిన తొలి ఓవర్ మొదటి మూడు బంతులకీ మూడు ఫోర్లు ఇచ్చేశాడు. దీంతో.. టీ20ల్లో వరుసగా ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు.

AlsoRead మళ్లీ అదే ఆట... పంత్ పై నెటిజన్ల ట్రోల్స్.....

ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో ఖలీల్‌ అహ్మద్‌కి సెలక్టర్లు వరుస అవకాశాలిస్తున్నారు. కానీ.. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఖలీల్.. ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌‌తో పాటు అంచనాల్ని తలకిందులు చేసేశాడు. 

రెండో టీ20కే ఖలీల్ ని దూరం పెడతారని అనుకున్నారు. కానీ తొలగించకుండా రెండో టీ20లో అవకాశం ఇచ్చారు. అయితే... ఆ అవాకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు మ్యాచుల్లో కలిపి మొత్తం 7 ఫోర్లు ఇచ్చాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

AlsoRead కోహ్లీని వెనక్కినెట్టిన స్మృతీ మంథాన: వేగంగా 2వేల పరుగుల క్లబ్బులోకి...

ఖలీల్ కి అండర్ గ్రౌండ్ కి వెళ్లే సమయం వచ్చిదంటూ మీమ్స్ క్రియెట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంకొందరమో... ఖలీల్ ని తిట్టడాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్... అతని ఇంటికి వెళ్తున్నారంటూ మీమ్స్ క్రియేట్ చేయడం విశేషం. పంత్ తర్వాత ఇప్పుడు ఎక్కడ  చూసినా ఖలీల్ మీమ్స్ కనపడుతున్నాయి.