Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాతో మూడో వన్డే: ఇషాన్ కిషన్ సెంచరీ... టెండూల్కర్‌ని దాటేసిన విరాట్ కోహ్లీ...

ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ... విరాట్ కోహ్లీతో కలిసి శతాధిక భాగస్వామ్యం... భారీ స్కోరు వైపు పరుగులు పెడుతున్న టీమిండియా...

 

India vs Bangladesh 3rd ODI: Ishan Kishan makes debut century, Team India scores
Author
First Published Dec 10, 2022, 1:28 PM IST

తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ గాడిలో పడినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్‌లో ఆడుతున్న తొలి వన్డేలోనే సెంచరీ బాదాడు. 85 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు ఇషాన్ కిషన్...

తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయిన శిఖర్ ధావన్, మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన శిఖర్ ధావన్... మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

ఈ వన్డే సిరీస్‌లో 6 సగటుతో పరుగులు చేసిన శిఖర్ ధావన్, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. శిఖర్ ధావన్ అవుటైన తర్వాత  విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ తన స్టైల్‌లో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తే... విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...

1 పరుగు వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ జారవిడిచాడు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. బంగ్లాదేశ్‌లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు ఇషాన్ కిషన్...

గౌతమ్ గంభీర్ 21 ఏళ్ల 184 వయసులో బంగ్లాలో 50+  స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా ఉండగా ఇషాన్ కిషన్ వయసు 24 ఏళ్ల 145 రోజులు. బంగ్లాదేశ్‌లో 1000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. బంగ్లాలో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు విరాట్. రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌లో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా విరాట్ ఆ రికార్డును సమం చేశాడు..

సచిన్ టెండూల్కర్ 6 దేశాల్లో 1000+ వన్డే పరుగులను అందుకోగా విరాట్ కోహ్లీ నాలుగు దేశాలపై ఈ ఫీట్ సాధించాడు. సనత్ జయసూర్య, జయవర్థనే ఐదు దేశాలపై ఈ ఫీట్ సాధించి.. విరాట్ కంటే ముందున్నారు. బంగ్లాదేశ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. బంగ్లాపై సచిన్ 1316 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 1320+ పరుగులను దాటేశాడు...

85 బంతుల్లో సెంచరీని అందుకున్న ఇషాన్ కిషన్, ఆ తర్వాత మరింత వేగం పెంచాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios