Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023 Final: భారత్ గెలవాలి.. స్టేడియంలోనే హనుమాన్ చాలీసా పఠనం, వీడియో వైరల్

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పఠించిన ‘‘హనుమాన్ చాలీసా’’ పఠించడం ప్రత్యేకంగా నిలిచింది.

India Vs Australia World Cup Final: Crowd Chants 'Hanuman Chalisa' In Unison; Watch Video ksp
Author
First Published Nov 19, 2023, 6:10 PM IST

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. భారత్ మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు క్రికెట్ లవర్స్. ఫైనల్ నేపథ్యంలో దేశ ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అలాగే క్లబ్బులు, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే దేశంలోని పలు నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌ తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. 

బయటే పరిస్ధితి ఇలా వుంటే.. స్వయంగా మ్యాచ్‌కు హాజరైన వారి ఆనందానికి అవధులు వుండవు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోడీ మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. భారత అభిమానులు టీమిండియా జెర్సీలను ధరించి మన క్రికెటర్లను ఉత్సాహపరుస్తున్నారు. దాదాపు లక్ష మంది ఈ మ్యాచ్‌కు హాజరైనట్లు అంచనా. ఈ మ్యాచ్ సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్  విమానాల బృందం ఎయిర్‌ షో సహా అనేక ఆసక్తికరమైన క్షణాలను ప్రేక్షకులు వీక్షించారు. 

 

 

వీటన్నింటిలోకి మ్యాచ్ ప్రారంభానికి ముందు పఠించిన ‘‘హనుమాన్ చాలీసా’’ పఠించడం ప్రత్యేకంగా నిలిచింది. భారత్ విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ప్రపంచకప్ టైటిల్ పోరుకు దిగుతుండటంతో మైదానంలో ‘భారత్ మాతాకీ జై ’’ నినాదాలు మిన్నంటాయి. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే 90 పరుగులకే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వికెట్‌లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జంట ఆదుకుంది. 

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత వైమానిక దళంలోని సూర్యకిరణ్ ఏరో బాటిక్ బృందం.. ప్రదర్శించిన ఎయిర్‌షో ఆకట్టుకుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం చేసిన విన్యాసాలను ప్రేక్షకులు రెప్పవాల్చకుండా వీక్షిస్తూ.. తమ మొబైల్స్‌లో బంధించారు. 1996లో ఏర్పాటైన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందంలో భారత వైమానిక దళానికి చెందిన సుశిక్షుతులైన పైలట్‌లు వున్నారు. వారు ఖచ్చితమైన ఏరోబాటిక్స్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. హాక్ ఎమ్‌కే 132 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎగురువేస్తూ భారత్‌తో పాటు విదేశాల్లోని అనేక మంది ప్రేక్షకులను ఈ బృందం ఆకట్టుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios