Asianet News TeluguAsianet News Telugu

చెన్నైలో హ్యాట్రిక్ ‘డక్’! ఇషాన్ , రోహిత్ , అయ్యర్ డకౌట్... 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

ICC World cup 2023: సున్నాలు చుట్టిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్.. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా..

 

India vs Australia, Rohit Sharma, Ishan Kishan, Shreyas Iyer goes for duck, Team India lost 3 wickets for 2 runs CRA
Author
First Published Oct 8, 2023, 6:45 PM IST

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఆడిన రోహిత్ శర్మ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు..

రోహిత్ రివ్యూ తీసుకునా, టీవీ రిప్లైలో ఫలితం అంపైర్ కాల్స్‌గా రావడంతో టీమిండియాకి ఫలితం దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హజల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సమయానికి 2 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా, 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. టీమిండియా చేసిన 2 పరుగులు కూడా ఎక్స్‌ట్రాల రూపంలోనే రావడం విశేషం. 

 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 49.3 ఓవర్లలో 199 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. మిచెల్ మార్ష్ డకౌట్ కాగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

 అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు. 25 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.  20 బంతుల్లో 8 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, అశ్విన్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.  20 బంతుల్లో 6 పరుగులు చేసిన ఆడమ్ జంపా, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరును 200 మార్కుకి దగ్గరగా చేర్చాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆఖరి 3 వికెట్లకు 59 పరుగులు జోడించడం విశేషం. 

భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌కి ఓ వికెట్ దక్కగా కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. సిరాజ్, హార్ధిక్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios