టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా  డ్రిల్ తో అదరగొడుతున్నాడు.  త్వరలో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో.. సీరిస్ ప్రారంభం కావడానికి ముందే.. రవీంద్ర జడేజా కసరత్తులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

ఆ వీడియోలో రవీంద్ర జడేజా కొత్త పద్ధతిలో డ్రిల్ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సిరీస్ కోసం జడేజా కష్టపడుతున్న విధానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా.. నవంబర్ ‌27 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుండగా.. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ ఆస్ట్రేలియా టూర్‌కు సంబంధించి మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్ శర్మలకు రెస్ట్ ఇచ్చింది. ఇక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

వన్డే సిరీస్:

తొలి వన్డే: నవంబర్ 27, వేదిక- సిడ్నీ
రెండో వన్డే: నవంబర్ 29, వేదిక- సిడ్నీ
మూడో వన్డే: డిసెంబర్ 2. వేదిక- మనుక ఓవెల్, కాన్‌బెర్రా
టీ20 సిరీస్:

తొలి టీ20: డిసెంబర్ 4, వేదిక- మనుక ఓవెల్, కాన్‌బెర్రా
రెండో టీ20: డిసెంబర్ 6. వేదిక- సిడ్నీ
మూడో టీ20: డిసెంబర్ 8, వేదిక- సిడ్నీ
టెస్ట్ సిరీస్:

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్(డిసెంబర్ 6-8): వేదిక-డ్రమ్మోయిన్ ఓవెల్, సిడ్నీ
రెండో ప్రాక్టీస్ మ్యాచ్(డిసెంబర్ 11-13)(డే/నైట్): వేదిక- సిడ్నీ
తొలి టెస్ట్: డిసెంబర్ 17-21 వరకు(డే/నైట్), వేదిక- అడిలైడ్
రెండో టెస్ట్: డిసెంబర్ 26-30 వరకు, వేదిక- మెల్‌బోర్న్
మూడో టెస్ట్: జనవరి 7-11 వరకు, వేదిక- సిడ్నీ
నాలుగో టెస్ట్: జనవరి 15-19 వరకు, వేదిక-బ్రిస్బేన్