రేపటి నుంచే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్... లైవ్ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు...
రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. మొహాలీలో మొదటి వన్డే! కెప్టెన్‌గా కెఎల్ రాహుల్... శ్రేయాస్ అయ్యర్‌కి అసలైన పరీక్ష
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది భారత జట్టు. శుక్రవారం, సెప్టెంబర్ 22న ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలీలో జరిగే మొదటి వన్డే, మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ జరుగుతుంది..
మొదటి రెండు మ్యాచులకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ దూరంగా ఉంటున్నారు. దీంతో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మొదటి వన్డేలు జరగబోతున్నాయి. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.
ఇప్పటిదాకా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో 10 వన్డే సిరీస్‌లు జరిగాయి. ఇందులో నాలుగింట్లో భారత జట్టు గెలవగా, మిగిలిన 6 సిరీస్‌లను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే 2013 నుంచి జరిగిన ఐదు సిరీసుల్లో మూడింట్లో టీమిండియానే గెలవడం విశేషం.
2013లో 3-2 తేడాతో వన్డే సిరీస్ నెగ్గిన భారత జట్టు, 2017లో 4-1, 2020లో 2-1 తేడాతో వన్డే సిరీస్‌లు గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఏడాది ఆడిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో పరాజయం పాలైంది భారత జట్టు..
ఇండియా - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రసార హక్కులను వయాకాం18 సొంతం చేసుకుంది. జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో టీవీలో మ్యాచ్ ప్రసారాలు చూడొచ్చు.
మొహాలీలో మొదటి వన్డే ఆడే భారత జట్టు, రెండో వన్డే కోసం ఇండోర్‌కి వెళ్తుంది. మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగుతుంది. గాయంతో ఆసియా కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌కి ఈ వన్డే సిరీస్ కీలకంగా మారింది.
గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. మొదటి వన్డేకి అందుబాటులో ఉండడం లేదు. వన్డే వరల్డ్ కప్‌కి ముందు సౌతాఫ్రికాతో 5 వన్డేల సిరీస్ ఆడిన ఆస్ట్రేలియా, తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి 2-3 తేడాతో సిరీస్ కోల్పోయింది..
దీంతో ఈ వన్డే సిరీస్‌లో కీ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ గాయంతో బాధపడుతూ ఇండియాతో వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలి సగం మ్యాచులకు అతను అందుబాటులో ఉండడం లేదు. దీంతో ట్రావిస్ హెడ్ ప్లేస్‌లో మార్నస్ లబుషేన్, వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. అతనికి భారత్‌తో వన్డే సిరీస్‌లో అసలైన ఛాలెంజ్ ఎదురుకానుంది.
మొదటి రెండు వన్డేలకు భారత జట్టు ఇది: కెఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్