డేవిడ్ వార్నర్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అనేకంటే... సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అని పిలవాలేమో. అంతలా ఆ జట్టుతో కనెక్ట్ అయిపోయాడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్ ఇచ్చిన గుర్తింపునీ, భారతీయులు తనపై చూపిన అభిమానాన్ని ఎప్పుడూ మరిచిపోని డేవిడ్ వార్నర్... మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డేల్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఆ సమయంలో ప్రేక్షకుల్లోనుంచి కొందరు తెలుగు అభిమానులు... ‘వార్రర్ వార్నర్ బుట్టబొమ్మ’ అంటూ అరుస్తూ కేకలు వేశారు. వారి కోరికను అర్థం చేసుకున్న డేవిడ్ వార్నర్... ఫీల్డింగ్ చేస్తూనే ‘బుట్టబొమ్మ’ స్టెప్పులు వేశారు.

అంతకుముందు చెన్నై వరదల గురించి తెలుసుకున్న వార్నర్... ‘చెన్నైలో అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా...’ అంటూ పోస్టు చేశారు. భారత క్రికెటర్లే పట్టించుకోని తరుణంలో వార్నర్ ఇలా పోస్టు చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

మ్యాచ్ సమయంలో హార్ధిక్ పాండ్యా షూస్ లేస్ కట్టిన వార్నర్‌కి భారతీయ అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ అద్భుత విజయం వెనక డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడని ఒప్పుకుని తీరాల్సిందే.