India vs Australia , 5th T20I : పరుగులు చేయలేక అపసోపాలు పడ్డ భారత్.. ఆసీస్ విజయలక్ష్యం 161
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో ఆసీస్ ముందు టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది . ఆస్ట్రేలియా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో స్కోరు వేగం మందగించింది.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో ఆసీస్ ముందు టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (53), జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహ్రన్‌డార్ఫ్ , డ్వారిషుస్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్డీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సింఘా తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ నెగ్టిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , రుతురాజ్ గైక్వాడ్‌లు జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఈ దశలో దూకుడుగా ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ , రుతురాజ్‌లు వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) సైతం నిరాశపరిచాడు. రింకూ సింగ్ (6) కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో శ్రేయస్ అయ్యర్ , జితేశ్ శర్మ , అక్షర్ పటేల్‌లు బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును నడిపించారు. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో స్కోరు వేగం మందగించింది. అయినప్పటికీ వీరు ముగ్గురు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది భారత్.