Asianet News TeluguAsianet News Telugu

కెఎల్ రాహుల్ అవుట్, అక్షర్ పటేల్ రనౌట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా! విజయానికి ఇంకా..

30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 37 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... 32 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్! 2 పరుగులకే అక్షర్ పటేల్ రనౌట్.. 

India vs Australia 3rd ODI: KL Rahul, Axar Patel goes back to back, Team India losses 4th wicket cra
Author
First Published Mar 22, 2023, 8:23 PM IST

చెన్నైలో జరుగుతున్న ఆఖరి నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 270 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

50 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర సీన్ అబ్బాట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

టీమిండియా విజయానికి 126 బంతుల్లో 119 పరుగులు కావాలి. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎవ్వరూ హాఫ్ సెంచరీ మార్కు దాటకపోయినా స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన 10 బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోరు చేసి మూకుమ్మడిగా రాణించారు.. 

31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, 3 బంతులాడి డకౌట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్.  47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 45 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..  26 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 

23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన సీన్ అబ్బాట్‌ని అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా 21 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అస్టన్ అగర్, సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 247 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ఆఖరి వికెట్‌కి 22 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా 260 పరుగుల మార్కును దాటింది..

Follow Us:
Download App:
  • android
  • ios