Asianet News TeluguAsianet News Telugu

సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్... నెం.1 బ్యాటర్‌గా శుబ్‌మన్ గిల్ ప్లేస్ కన్ఫార్మ్...

సూపర్ సెంచరీతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఫామ్‌ని అందుకున్న శ్రేయాస్ అయ్యర్... మరో సెంచరీతో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా శుబ్‌మన్ గిల్.. 

India vs Australia 2nd ODI: Shubman Gill, Shreyas Iyer scores Centuries, Team India heading CRA
Author
First Published Sep 24, 2023, 4:39 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో 11 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్, ఆసీస్‌తో మొదటి వన్డేలో 3 పరుగులు చేసి బ్యాక్ లక్‌తో రనౌట్ అయ్యాడు..

ఇండోర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో సూపర్ సెంచరీతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఫామ్‌ని నిరూపించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్..

86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. అయ్యర్ వన్డే కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. సెంచరీ తర్వాత సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్...

క్యాచ్ పట్టిన తర్వాత సీన్ అబ్బాట్ చేతిలోని బంతి, నేలను తాకినట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రిప్లైకి ముందు పెవిలియన్‌కి వెళ్లిన శ్రేయాస్ అయ్యర్, థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చాడు. వస్తూనే ఫోర్ బాదాడు..

ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి, పెవిలియన్ చేరాడు శ్రేయాస్ అయ్యర్. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గత మ్యాచ్‌లో 70+ స్కోరు చేసిన శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో సెంచరీతో ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు..

ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఈ బుధవారం ప్రకటించే తాజా ర్యాంకింగ్స్‌లో నెం.1 ప్లేస్‌ని దక్కించుకోవడం ఖాయం. 92 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్.  35వ వన్డే ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి ఇది ఆరో సెంచరీ కాగా, ఈ ఏడాది ఐదోది. 

Follow Us:
Download App:
  • android
  • ios