India vs Afghanistan T20: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ థ్రిల్లింగ్ గా ముందుకు సాగింది. ఇరు టీమ్స్ క‌లిపి 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. ముఖ్యంగా ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ గుల్బ‌దీన్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చిప‌డేశాడు. 

India vs Afghanistan T20 : బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ్యాచ్ సూప‌ర్ థ్రిల్లింగ్ గా సాగింది. ఇరు టీమ్స్ ప్లేయ‌ర్స్ బ్యాట్ తో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఇరు టీమ్స్ క‌లిపి 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. ముఖ్యంగా ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ గుల్బ‌దీన్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చిప‌డేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ, రింకూ సింగ్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టారు. 69 బంతుల్లో121 ప‌రుగులు చేయ‌గా, రింకూ సింగ్ 39 బంతుల్లో 69 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 212/4 ప‌రుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్ బ్యాట్ కు దిగిన ఆఫ్ఘ‌నిస్తాన్.. 20 ఓవ‌ర్ల‌లో 212/6 ప‌రుగులు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కీల‌క స‌మ‌యంలో అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేప‌డేశాడు ఆఫ్ఘ‌నిస్తాన్ బ్యాట‌ర్ గుల్బ‌దీన్. 23 బంతుల్లో 55* పరుగులు చేసిన గుల్బదిన్ మ్యాచ్ ను సూప‌ర్ ఓవ‌ర్ కు తీసుకెళ్లాడు. గుర్బాజ్ న‌బీ, ఇబ్రహీం జద్రాన్ లు రాణించ‌డంతో ఆఫ్ఘ‌న్ మ్యాచ్ ను డ్రాకు తీసుకెళ్లింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…