న్యూఢిల్లీ: ఒకప్పుడు అద్భుత ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టుతో ప్రస్తుత టీమిండియాను భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పోల్చాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ ఇమ్రాన్ ఖాన్ ను గుర్తుకు తెస్తున్నాడని ఆయన అన్నారు. వీరిద్దరిది కూడా చివరి వరకు ఓటమిని అంగీకరించే తత్వం కాదని ఆయన అన్నాడు.

న్యూజిలాండ్ పై కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆడిన తీరు చూస్తే ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టు గుర్తుకొచ్చిందని ఆయన అన్నాడు. ఓడిపోయే దశలో కూడా ఒక మార్గం అన్వేషించి విజయంగా మలుచుకోవడం ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టులో కనిపించేదని, ఇదంతా ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్మమవుతుందని అన్నాడు. 

న్యూజిలాండ్ పై జరిగిన ఐదు వన్డేల సిరీస్ చివరి రెండు వన్డేలు టై కావడంతో సూపర్ ఓవర్లు ఆడిన విషయం తెలిసిందే. ఈ సూపర్ ఓవర్లలో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ సేన ఛేదింది సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 

చివరి రెండు మ్యాచులో ఓడిపోయే దశకు చేరుకున్న స్థితిలో కూడా చివరి ఓవరు వరకు పోరాడి మ్యాచులను భారత్ టై చేసింది. టై చేయడం ద్వారా భారత్ కు ఆ రెండు మ్యాచులను కూడా గెలుచుకునే అవకాశం దక్కింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ కెప్టెన్సీపై వ్యాఖ్యలు చేసాడు.