తప్పుడు సాక్ష్యాలతో వయసు తక్కువగా చూపించి, అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ ఆడినట్టు రాజవర్థన్ హంగర్కేకర్‌పై ఆరోపణలు...
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ టీమ్ ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగర్కేకర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు రాజవర్థన్, తప్పుడు ధ్రువ పత్రాలతో మోసం చేశాడని ఆరోపిస్తూ మహారాష్ట్ర క్రీడా అండ్ యూత్ డిపార్ట్‌మెంట్ కమిషనర్, బీసీసీఐకి లేఖ రాసింది...
ఐసీసీ నిబంధనల ప్రకారం 19 ఏళ్ల నిండని కుర్రాళ్లకు మాత్రమే అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు అర్హులు. 19 ఏళ్లు దాటితే, అండర్ 19 టోర్నీలు ఆడేందుకు అర్హులు కారు. మహారాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఓంప్రకాశ్ బకోరియా ఆరోపణల ప్రకారం రాజవర్థన్ హంగర్కేకర్ వయసు 21 ఏళ్లు...
2001, జనవరి 10న జన్మించిన రాజవర్థన్ హంగర్కేకర్, 2002, నవంబర్ 10న జన్మించినట్టుగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అండర్ 19 భారత జట్టులో చోటు దక్కించుకున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నాడు ఓంప్రకాశ్ బకోరియా...
బీసీసీఐ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం ఓంప్రకాశ్ బకోరియా, రాజవర్థన్ హంగర్కేకర్ పుట్టినరోజు మార్చినట్టుగా సాక్ష్యాలు కూడా పంపాడు... అండర్ 19 ఆసియా కప్‌తో పాటు అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఆడిన రాజవర్థన్ హంగర్కేకర్... ఐసీసీ పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ఆరు మ్యాచులు ఆడి, ఐదు వికెట్లు తీశాడు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్‌కే) రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన రాజవర్థన్ హంగర్కేకర్, భారీ షాట్లు ఆడడంలో దిట్ట...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన ప్లేయర్లు మంచి ధరను దక్కించుకోగలిగారు. అండర్ 19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు, బౌలర్లు మంచి ధరను దక్కించుకోగలిగారు... అండర్-19 ఆల్‌రౌండర్ ప్లేయర్ లలిత్ యాదవ్‌ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు...
రిపల్ పటేల్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. యశ్ ధుల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది...
తెలుగు క్రికెటర్, ఆల్‌రౌండర్ ఎన్. తిలక్ వర్మను రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అండర్ 19 వరల్డ్ కప్ హీరో రాజ్ ఆనంద్ బవా కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. అండర్ 19 వరల్డ్ కప్ హీరో రాజ్ బవాని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...
అండర్ 19 ఆసియా కప్ టోర్నీతో పాటు ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీని గెలిచిన కెప్టెన్ యశ్ ధుల్, రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరుపున ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనూ సెంచరీతో అదరగొట్టాడు...
