Asianet News TeluguAsianet News Telugu

India Tour Of South Africa 2023-24:వైట్ బాల్ పోటీలకు కోహ్లి దూరం, రోహిత్ శర్మపై ఇంకా రాని స్పష్టత

దక్షిణాఫ్రికాతో  జరిగే  టీ 20 వన్ డే సిరీస్ కు భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది.  ఈ విషయమై  నివేదికలు తెలుపుతున్నాయి.

 India Tour Of South Africa 2023-24: Virat Kohli To Miss White Ball Matches, Rohit Sharma Participation Unclear - Report lns
Author
First Published Nov 29, 2023, 1:13 PM IST


న్యూఢిల్లీ:వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు  టీమిండియా క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అందుబాటులో ఉండకపోవచ్చని  ఓ నివేదిక తెలుపుతుంది.ఆరు వైట్ బాల్ మ్యాచులకు ఈ ఇద్దరు  అందుబాటులో ఉండకపోవచ్చని ఈ నివేదిక చెబుతుంది.

అస్ట్రేలియాతో జరుగుతున్న  టీ 20 వన్ డే  సిరీస్ నుండి  వీరిద్దరికి భారత క్రికెట్ జట్టు మేనేజ్ మెంట్ విశ్రాంతిని ఇచ్చింది.  ఆసియా కప్,  ప్రపంచకప్ వరకు సుధీర్ఘంగా  క్రికెట్ మ్యాచ్ లు ఆడారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తెలిపింది.  ఈ  సిరీస్ ల కారణంగా ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తక్కువ కాలం పాటు క్రికెట్ పోటీలకు విరామం తీసుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా మ్యాచ్ కు కూడ వీరిద్దరిని ఎంపిక చేయకపోవచ్చనే ప్రచారం సాగుతుంది.  

భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య  టీ 20 వన్ డే సిరీష్ క్లైమాక్స్ చేరుకుంది. ఇప్పటికే  మూడు మ్యాచులు పూర్తయ్యాయి.ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది.  రానున్నరోజుల్లో  అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ  మూడు ఫార్మాట్లకు  భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

 కుటుంబ సభ్యులతో భారత క్రికెట్ జట్టు  సభ్యుడు విరాట్ కోహ్లి  లండన్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో  ఈ ఏడాది డిసెంబర్  10న  జరిగే టీ 20 సిరీస్ కు తాను అందుబాటులో ఉండనని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు తెలిపినట్టుగా సమాచారం. తనకు వైట్ బాల్ క్రికెట్ నుండి విరామం అవసరమని బీసీసీఐ, సెలెక్టర్లకు కోహ్లి చెప్పారని సమాచారం. తాను వైట్ బాల్ క్రికెట్ ఆడాలని కోరుకున్నప్పుడు  తిరిగి  వస్తానని  ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తెలిపింది.

 ప్రపంచకప్ పురుషుల క్రికెట్ పోటీల్లో  765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా  విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. అయితే  బాక్సిండ్ డే రోజున ప్రారంభమయ్యే  రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు  విరాట్ కోహ్లి అందుబాటులో  ఉంటాడని ఈ నివేదిక తెలుపుతుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడడానికి బీసీసీఐకి  విరాట్ కోహ్లి తన సానుకూలతను వ్యక్తం చేశారు.  దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల మ్యాచ్ లకు  కోహ్లి అందుబాటులో ఉంటాడని ఈ నివేదిక తెలుపుతుంది.

మరో వైపు  రోహిత్ శర్మ కూడ వైట్ బాల్ మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఐసీసీ పురుషుల క్రికెట్  ప్రపంచకప్  2023  ఫైనల్ మ్యాచ్ తర్వాత  రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లిలు వైట్ బాల్  ఆడడంపై  చర్చకు దారి తీసింది.  ఈ ఏడాది సెప్టెంబర్ లో అస్ట్రేలియాతో జరిగిన వన్ డే సిరీస్ కు ఈ ఇద్దరు సీనియర్ సభ్యులు విశ్రాంతి తీసుకున్నారు. ప్రపంచకప్ ముందు జరిగిన చివరి వన్ డే మాత్రమే ఆడారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios