న్యూఢిల్లీ: టీ20లో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కు బీసీసీఐ సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. న్యూజిలాండ్ పై జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో అతనికి స్థానం దక్కలేదు. కాలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ కు చోటు కల్పించారు. వన్డే జట్టుకు ఎంపికైన మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలకు టెస్టు జట్టులోనూ స్థానం దక్కింది. యువ పేసర్ నవదీప్ సైనీకి టెస్టు జట్టులో కూడా స్థానం దక్కింది.

తెలుగు క్రికెటర్ హనుమ విహారీ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. జట్టులో వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. టెస్టు జట్టులో ఇషాంత్ శర్మ పేరు కూడా ఉంది. అయితే అతను ఫిట్నెస్ టెస్టును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుల్దీప్ యాదవ్ కూడా టెస్టు జట్టులో స్థానం పొందలేదు.

న్యూజిలాండ్ పై తొలి టెస్తు ఫిబ్రవరి 21వ తేదీన వెల్లింగ్టన్ లో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 29వ తేదీన క్రిస్ట్ చర్చిలో మొదలపుతుంది. 

టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వార్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ షాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ