India vs England: రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో రవీంద్ర జడేజా మరోసారి మెరిశాడు. ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసుకోగా, ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
India vs England : రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు రోజుం తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. 353 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ కాగా, జోరూట్ 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓలీ రాబిన్సన్ తన తొలి టెస్టు హాఫ్ సెంచరీని కొట్టి, 58 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. జాక్ క్రాలీ 42 పరుగులు చేయగా, బిగతా ప్లేయర్లు పెద్ద స్కోర్లు చేయలేదు.
ఇక భారత్ బౌలర్లలో రెండో రోజు రవీంద్ర జడేజా వరుస నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ త్వరగా ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా మరోసారి మెరుస్తూ 4 వికెట్లు తీసుకున్నాడు. జడేజాకు తోడుగా ఆకాశ్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
ఆదిలోనే భారత్ కు షాక్..
353 పరుగులకు ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ప్రస్తుతం టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ లు క్రీజులో ఉన్నారు.
