Asianet News TeluguAsianet News Telugu

అత్యంత అరుదైన సందర్భం.. అది మరిచిన బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా..

Border Gavaskar Trophyఫ భారత్ - ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక   బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ   మొదలైంది. నాగ్‌పూర్ వేదికగా  ఇరు జట్లు   తొలి టెస్టును ఆడుతున్నాయి. 

India and Australia Test Battle Complete 75 Years,  Both Boards  Forgets to Celebrate MSV
Author
First Published Feb 9, 2023, 2:08 PM IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా  భారత్ - ఆస్ట్రేలియాలు   నేటి నుంచి  నాగ్‌పూర్ లో తొలి టెస్టు ఆడుతున్నాయి.  ఇరు జట్లూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ  సిరీస్ లో   భాగంగా తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ చేస్తున్నది. కాగా 1996 నుంచి  ఈ సిరీస్ ను బీజీటీ అని పిలుస్తున్నా  వాస్తవానికి   ఇరు జట్ల మధ్య  టెస్టులు స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచే మొదలయ్యాయి.  భారత్ - ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు  మెల్‌బోర్న్ వేదికగా    1948లోనే జరిగింది.  ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ లు ప్రారంభమై  75 ఏండ్లు  పూర్తయింది.  

భారత్ - ఆస్ట్రేలియా  లు టెస్టులో  హోరాహోరి పోటీ పడటం   దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిననాటి నుంచే ఉంది.  రెండు శతాబ్దాల బ్రిటీష్ అరాచక పాలన  నుంచి భారత్   స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న తర్వాత  మన దేశం క్రికెట్ ఆడటానికి వెళ్లిన తొలి విదేశీ దేశం ఆస్ట్రేలియానే కావడం గమనార్హం.   1947-48 లోనే భారత్.. ఆసీస్ లో ఐదు టెస్టులు ఆడింది.   

1948లో భారత జట్టు.. జనవరి 1  నుంచి 5 వరకు   మెల్‌బోర్న్ లో తొలి టెస్టు ఆడింది.   ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా..  తొలి ఇన్నింగ్స్ లో 394 పరుగులు చేసింది.   తర్వాత భారత్.. 9 వికెట్లకు 291 పరుగులు సాధించింది.  అనంతరం ఆసీస్.. 4 వికెట్ల నష్టానికి 255 రన్స్ చేశారు.  భారత్..  359 పరుగుల లక్ష్య ఛేదనలో  125 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ  ఆసీస్ దిగ్గంజ డాన్ బ్రాడ్‌మన్  రెండు సెంచరీలు చేయడం విశేషం.  ఈ సిరీస్ ను ఆసీస్.. 4-0తో గెలుచుకుంది. 

పట్టించుకోని బీసీసీఐ, సీఏ.. 

ఇరు దేశాల మధ్య టెస్టు క్రికెట్ ఆడటం మొదలై  75 ఏండ్లయిన సందర్భంగా  ఇరు జట్ల క్రికెట్ బోర్డులు  నాగ్‌పూర్ టెస్టులో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు.  కానీ  అటు బీసీసీఐ గానీ ఇటు క్రికెట్ ఆస్ట్రేలియాలు గానీ  అసలు దాని గురించి  మాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించాయి. మాములుగా 75 సంవత్సరాలు అనేది  వ్యక్తులు గానీ సంస్థలు గానీ  మరేదైనా ఫీల్డ్ లో గానీ ఒక  మార్కింగ్ ఈయర్. అలాంటిది  బీసీసీఐ, సీఏకు మాత్రం  అంత  ఇంపార్టెంట్ అనిపించలేదు. గౌరవ సత్కారాలు చేయకున్నా 75 ఏండ్ల సందర్భంగా  ఓ ట్వీట్ కూడా చేయలేదు.  కనీసం ఆటగాళ్లకు ఓ జ్ఞాపికను అందజేయడమో  ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్లకు  సత్కారం  చేయడమో  చేస్తే బాగుండేదని     రెండు దేశాల క్రికెట్  అభిమానులు వాపోతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios