దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన సరికొత్త రికార్డు
IND W vs SA W: దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు గెలుచుకుంది. సిరీస్‌లో అద్భుతమైన ఆటతో ఆఫ్రికన్ జట్టును వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించింది.
ND W vs SA W: భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికాను చిత్తుచేసింది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు గెలుచుకుంది. సిరీస్‌లో ఆఫ్రికన్ జట్టును వైట్‌వాష్ చేసింది. ఈ మూడు మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగ్గా.. తొలి మ్యాచ్‌లో భారత్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం (జూన్ 23) జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టు 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. మహిళా క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
ఈ సిరీస్ మొత్తం అద్భుతమైన ఆటతో అదరగొట్టింది టీమిండియా స్టార్ స్మృతి మంధాన. మంధాన ఈ సిరీస్‌లో వరుసగా మూడో సెంచరీని కోల్పోయింది కానీ, మరో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 83 బంతుల్లో 90 పరుగులు చేసి ఔట్ అయింది. అంతకుముందు స్మృతి తొలి మ్యాచ్‌లో 117 పరుగులతో సెంచరీ కొట్టింది. రెండో మ్యాచ్‌లో 136 పరుగులు ధనాధన్ బ్యాటింగ్ చేసింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 343 పరుగులు చేసి ఎడమచేతి వాటం ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్‌లో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది.
భారత బౌలర్లు అదరగొట్టారు..
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆఫ్రికన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. వోల్వార్డ్ 57 బంతుల్లో 61 పరుగులు ఇన్నింగ్స్ ఆడింది. తాజ్మిన్ బ్రిట్స్ 38 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. అలాగే, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
స్మృతి మంధాన సెంచరీ మిస్..
216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 40.4 ఓవర్లలోనే విజయం సాధించింది. దీంతో భారత్ 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. స్మృతి మంధాన భారత జట్టు తరఫున అత్యధికంగా 90 పరుగులు చేసింది. 10 పరుగుల దూరంలో సెంచరీని కోల్పోయింది. స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 48 బంతుల్లో 42 పరుగుల వద్ద రనౌట్ అయింది. ఆ తర్వాత ప్రియా పునియా 28 పరుగులు, షెఫాలీ వర్మ 25 పరుగులు చేశారు. జెమిమా రోడ్రిగ్స్ 19 పరుగులతో, రిచా ఘోష్ 6 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టుకు విజయాన్ని అందించారు.
ఆఫ్ఘనిస్థాన్ మాత్రమే కాదు ఈ దేశాలు కూడా టీ20 ప్రపంచ కప్ లో అద్భుతాలు చేశాయి.. !
- Arundhati Reddy
- Bangalore
- Cricket
- Deepti Sharma
- Harmanpreet Kaur
- ICC Championship Match
- IND
- IND W vs SA W
- IND vs SA
- India
- India Women vs South Africa Women
- India vs South Africa
- Indian National Cricket Team
- Laura Wolvaardt
- M Chinnaswamy Stadium
- Smriti Mandhana
- South Africa
- South Africa vs India
- T20 World Cup
- T20 World Cup 2024
- Team India whitewashed South Africa