IND-W Vs ENG-W: బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టి.. ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టిన‌ దీప్తి శర్మ..

IND-W vs ENG-W Test: భార‌త మ‌హిళా క్రికెట్ స్టార్ అల్ రౌండ‌ర్ దీప్తి శర్మ.. మహిళా క్రికెట్ టెస్టుల్లో రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను న‌మోదుచేసింది. బ్యాంటింగ్, బౌలింగ్ లో స‌త్తా చాటి, ఇంగ్లాండ్ జట్టును దెబ్బ కొట్టింది.

IND-W vs ENG-W Test: Deepti Sharma Creates Havoc; Becomes Second Indian Player To Pick 5-Wickets And Smash 50 RMA

Star all-rounder Deepti Sharma: స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్ గా నిలిచింది. మహిళల టెస్టుల్లో ఇంగ్లాండ్ పై భారతీయులు చేసిన రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను దీప్తి నమోదు చేసింది. శుక్రవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆమె ఈ చారిత్రాత్మక ఘనత సాధించింది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు ఇంగ్లాండ్ పై అధిప‌త్యం చేలాయించింది. దీప్తి (5/7) అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ ను 136 పరుగులకే కట్టడి చేశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 104.3 ఓవర్లలో 428 పరుగుల భారీ స్కోర్ సాధించి మహిళల టెస్టు క్రికెట్ లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. రెండేళ్ల క్రితం టాంటన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సాధించిన 467 పరుగుల రికార్డును 450 పరుగుల మార్కును దాటాలని భావించింది.

1985లో న్యూజిలాండ్ తో జరిగిన డ్రా మ్యాచ్ లో 79 పరుగులు చేసి 6/99 వికెట్లు తీసిన శుభాంగి కులకర్ణి ఐదు వికెట్లు పడగొట్టి హాఫ్ సెంచరీతో ఈ చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఇప్పుడు దీప్తి సైతం ఐదు వికెట్లు తీయ‌డంతో పాటు తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ సెంచ‌రీ కొట్టింది. 

మహిళల క్రికెట్ టెస్టుల్లో ఇంగ్లాండ్ పై భారతీయుల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:

8/53 - నీతూ డేవిడ్ (1995)
5/07 -  దీప్తి శర్మ (2023)
5/24 - పూర్ణిమ రావు (1999)
5/25 - జులన్ గోస్వామి (2005)
5/33 - జులన్ గోస్వామి (2006)
5/45 - జులన్ గోస్వామి (2006)

T20 World Cup 2024: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జ‌రిగేది ఇక్క‌డే.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios