India Vs West Indies 2nd ODI: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన విండీస్.. కీరన్ పొలార్డ్ కు గాయం.. భారత జట్టులో ఒక మార్పు.. 

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచింది. ఇప్పటికే ఈ సిరీస్ లో తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంతో నిలిచిన రోహిత్ సేన.. రెండో వన్డేలో కూడా నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నది. అయితే కీలక వన్డేకు ముందు విండీస్ కు భారీ షాక్ తగిలింది. ఫిట్ గా లేకపోవడంతో ఈ వన్డే నుంచి ఆ జట్టు సారథి కీరన్ పొలార్డ్ తప్పుకున్నాడు. దీంతో ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

ఇక కెఎల్ రాహుల్ రాకతో భారత్.. ఇషాన్ కిషన్ ను పక్కనబెట్టింది. తొలి మ్యాచులో అవకాశం రాని కుల్దీప్ యాదవ్.. ఈ వన్డే లో కూడా బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇషాన్ కిషన్ తప్ప భారత జట్టులో పెద్దగా మార్పులేమీ లేవు. ఇక రాహుల్ ఈ వన్డేలో ఆడుతున్నా.. అతడు మాత్రం ఓపెనింగ్ కు రాలేదు. రోహిత్ తో పాటుగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓపెనర్ గా వచ్చాడు.

View post on Instagram

మరోవైపు గాయపడ్డ కీరన్ పొలార్డ్ స్థానంలో ఓడెన్ స్మిత్ ఆడనున్నాడు. తొలి వన్డేలో ఓడిన ఆ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ వన్డేలో కచ్చితంగా నెగ్గి తీరాల్సిందే. 

Scroll to load tweet…

జట్లు : టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

వెస్టిండీస్ : షే హోప్, బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అలెన్, ఓడెన్ స్మిత్, అల్జారి జోసెఫ్, కీమర్ రోచ్