India Vs West Indies 2nd ODI:  భారత్-వెస్టిండీస్ రెండో వన్డే కు  అండర్-19 ప్రపంచకప్ విజేతలు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన  గుజరాత్ క్రికెట్ అసోసియేషన్.. సీనియర్ల ఆట తిలకించిన జూనియర్లు.. 

టీమిండియా - వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేను వీక్షించడానికి నరేంద్ర మోడీ స్టేడియానికి ప్రత్యేక అథిథులు వచ్చారు. సీనియర్ల ఆట చూడటానికి అండర్-19 ప్రపంచకప్ విజేతలు అహ్మదాబాద్ కు విచ్చేశారు. యశ్ ధుల్ సారథ్యంలోని జట్టు మొత్తం స్టేడియంలో ప్రత్యక్షమైంది. యువ ఆటగాళ్లందరితో పాటు జట్టు కోచ్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షా లు స్టేడియంలో కాసేపు మ్యాచును వీక్షించారు.

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా.. ఇంగ్లాండ్ తో ముగిసిన మ్యాచులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరే జట్టు నెగ్గలేనంతగా.. ఏకంగా ఐదు సార్లు అండర్-19 ప్రపంచకప్ ను సాధించిన జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ).. రెండో వన్డేకు వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరింది. 

స్టేడియానికి వచ్చిన యువ క్రికెటర్లు.. భారత సీనియర్ జట్టు ఆటగాళ్ల ఆటను చూసి ఎంజాయ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు జాతీయ జెండాను ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు.

Scroll to load tweet…

ఇక అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికాను ఓడించి వేట మొదలుపెట్టిన యశ్ ధుల్ సేన.. ఆ తర్వాత ఐర్లాండ్, ఉగాండా లను ఓడించి క్వార్టర్స్ కు చేరింది. క్వార్టర్స్ లో గత ఛాంపియన్ బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి సెమీస్ కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను కూడా మట్టి కరిపించి ఫైనల్లో ఇంగ్లాండ్ పనిపట్టి కప్పు కొట్టిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు రూ. 40 లక్షల నగదు బహుమతి, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు ప్రకటించింది బీసీసీఐ.. 

పోరాడుతున్న వెస్టిండీస్ : 

View post on Instagram

టీమిండియాతో రెండో వన్డేలో విండీస్ కష్టాల్లో పడింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆ జట్టు 26 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. శమర బ్రూక్స్ ( 32 నాటౌట్), అకీల్ హోసిన్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. 3 వికెట్లు పడగొట్గాడు. 5 ఓవర్లు వేసిన అతడు రెండు మెయిడిన్లు వేయగా.. నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాహల్, ఠాకూర్ కు తలో వికెట్ దక్కింది. అంతకుముందు భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసిన విషయం తెలిసిందే.