Asianet News TeluguAsianet News Telugu

IND vs SA : 150 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి.. 

IND vs SA: భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2-టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ కేప్ టౌన్‌లో జరుగుతోంది. ఈ  టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించడంతో తొలిరోజే మొత్తం 23 వికెట్లు నేలకూలాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ చెత్త రికార్డును ముట్టగట్టుకుంది.

IND vs SA Stats & Records India Lose Last 6 Wickets On Same Score, First-Ever Instance In Test Cricket History KRJ
Author
First Published Jan 4, 2024, 8:40 AM IST

IND vs SA: కేప్ టౌన్ వేదికగా  దక్షిణాఫ్రికా, భారత్‌ (SAvsIND) మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ లో రాణించినా.. బ్యాటింగ్ లో మాత్రం చతికిలాపడింది.  భారత జట్టులోని చివరి ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. దాదాపు 150 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా 6 మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ జట్టు ఎలాంటి పరుగు లేకుండానే 6 వికెట్లు కోల్పోవడం తొలిసారి. దీంతో పరుగులేమీ ఇవ్వకుండా 6 వికెట్లు తీసిన రికార్డును కూడా సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది.

ఇంతకు ముందు ఇలా జరిగిందా?

దాదాపు 58 ఏళ్ల క్రితం ఇలాంటి పరిణమమే చోటుచేసుకుంది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. తొలుత 58 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టు.. ఆ తరువాత 59 పరుగుల వద్ద 6 వికెట్లు పడిపోయాయి. దీంతో ఆరుగురు బ్యాట్స్‌మెన్ 1 పరుగు మాత్రమే చేయగలిగారు.

ఇలాంటి మరో పరిణామం దక్షిణాప్రికా - న్యూజిలాండ్ మ్యాచ్ లో చోటు చేసుకుంది.  2012లో దక్షిణాఫ్రికాపై ఐదుగురు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. న్యూజిలాండ్ 133 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. అంత నిలకడగా సాగుతుందని భావించి మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత 133 పరుగుల వద్ద వరుసగా 5 వికెట్లు  కుప్పకూలాయి. 

తొలిరోజు మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్

ఇదిలా ఉంటే.. భారత్-దక్షిణాఫ్రికా టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 62 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios