Asianet News TeluguAsianet News Telugu

రాంచీలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్.. ప్రాక్టీస్‌లో కనిపించని కోహ్లీ, రోహిత్

రాంచీలో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భాతర బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ పాల్గొని చమటోడ్చారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. 

IND vs SA 3rd Test: practice session out rohit sharma and virat kohli
Author
Ranchi, First Published Oct 18, 2019, 9:33 AM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా చివరి టెస్టును కూడా గెలిచి ప్రత్యర్థి జట్టును వైట్ వాష్ చేయాలని భావిస్తోంది.

శనివారం నుంచి రాంచీలో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భాతర బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ పాల్గొని చమటోడ్చారు.

అయితే ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై స్పందించిన జట్టు మేనేజ్‌మెంట్ ఈ ప్రాక్టీస్ సెషన్ ఆప్షనల్ కావడం వల్లే కోహ్లీ, రోహిత్ దూరంగా ఉన్నారని ... శుక్రవారం జరిగే ప్రాక్టీస్‌లో జట్టు ఆటగాళ్లంతా పాల్గొంటారని తెలిపింది.

రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి..? గంగూలీ షాకింగ్ కామెంట్స్

పుణే టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించడంతో పాటు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు.

మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం. అతని తర్వాత ధోని 27 టెస్టులతో నిలిచాడు.. కెప్టెన్‌గా మహేంద్రుడు 60 టెస్టులకు నాయకత్వం వహించాడు.

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు.

బీసీసీఐ చీఫ్ గా దాదా: ఐసిసి ఈవెంట్స్ ల్లో ఫెయిల్ పై అసంతృప్తి

అయితే ఈ గాయం ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. పుణేలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్సులలోనూ డకౌట్‌గా వెనుదిరిగిన మార్కరమ్ మ్యాచ్ తర్వాత ఆ అసహనాన్ని ఒక బలమైన వస్తువుపై చూపించాడు. దాంతో అతని చేతికి తీవ్రమైన గాయమైంది.

జట్టు ఫిజియో తీయించిన ఎక్స్‌రేలో మణికట్టు ఎముకలో ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో మార్కరమ్ చికిత్స కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరాడు

Follow Us:
Download App:
  • android
  • ios