IND vs SA, 1st ODI: స్మృతి మంధాన సూప‌ర్ సెంచ‌రీ.. 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన భార‌త్

IND vs SA, 1st ODI: స్మృతి మంధాన, ఆశా శోభన అద్భుత‌మైన ఆట‌తో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31)ల విలువైన సహకారంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది.
 

IND vs SA, 1st ODI: Smriti Mandhana Super Century.. India beat South Africa by 143 runs RMA

IND vs SA, 1st ODI:  భార‌త స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో 127 బంతుల్లో 117 పరుగులు చేసి వన్డేల్లో ఆరో సెంచరీని సాధించింది. ఇక బౌలింగ్ లో లెగ్-స్పిన్నర్ ఆశా శోభన 4 వికెట్లు పడగొట్టడంతో అద్భుతమైన వ‌న్డే అరంగేట్రం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో ఎం చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 143 పరుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజయం సాధించింది.

బౌన్స్, అసాధార‌ణ బాల్ కదలికను అందించే పిచ్ ఉన్నప్పటికీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 99 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే, స్మృతి మంధాన మ‌రోసారి సూప‌ర్ ఇన్నింగ్స్ మెరిసి భార‌త్ కు మంచి స్కోర్ ను అందించారు. 12 బౌండరీలు, ఒక సిక్సర్‌తో స్మృతి మంధాన త‌న వ‌న్డే కెరీర్ లో 6వ సెంచ‌రీని న‌మోదుచేసింది. మంధాన తోడుగా దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31)ల విలువైన సహకారంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 265 ప‌రుగులు చేసింది.

బుమ్రా, స్టార్క్ లు సాధించ‌లేని రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన నేపాల్ స్టార్ ప్లేయ‌ర్..

బౌలింగ్ లోనూ భార‌త్ త‌న స‌త్తా చాటింది. 266 పరుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికాను అరంగేట్రం మ్యాచ్ లోనే ఆశా శోభన దెబ్బ‌కొట్టింది. ఆశా 21 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుంది. ఆమె అద్భుతమైన స్పిన్, పేస్‌తో కలిసిన బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. భార‌త్ బౌలింగ్ ముందు ప్రోటీస్ జ‌ట్టు భాగస్వామ్యాలను నిర్మించడంలో విఫ‌లం కావ‌డంతో భార‌త విజ‌యం సాధించింది. 37.4 ఓవర్లలో 122 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో భారత్‌కు శుభారంభం లభించింది.

టీ20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ డ్రామా.. ఆటగాళ్ల మధ్య బిగ్ ఫైట్.. వీడియో

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios