T20 World Cup 2024: అనేక వివాదాలు, వీసా ఇబ్బందుల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024లో తమ జట్టు తరఫున చివరి రెండు మ్యాచ్ లను ఆడిన ఆ జట్టు ప్లేయర్ సందీప్ లామిచానే మరో రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్, బుమ్రాలు సాధించలేనిది సాధించాడు.
T20 World Cup 2024: NEP vs BAN : టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ మ్యాచ్ లు ముగిశాయి. ఇప్పుడు సూపర్-8 పోరు జరగనుంది. అయితే, లీగ్ దశలో నేపాల్, బంగ్లాదేశ్ మధ్య 37వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు గెలిచినా.. నేపాల్ స్టార్ ప్లేయర్ సందీప్ లామిచానే హాట్ టాపిక్ గా మారాడు. మెగా టోర్నీలో ఆడటానికి వీసా సమస్యల నుంచి బయటపడిన సందీప్ నేపాల్ తరఫున చివరి రెండు మ్యాచ్‌లు ఆడాడు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దిగ్గజ బౌలర్లు ఎవరూ సాధించలేని రికార్డును సృష్టించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ లామిచానే 2 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. సందీప్ లామిచానె కేవలం 54 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు 53 టీ20 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 100 వికెట్లు తీసుకుని టాప్ లో ఉన్నాడు. అయితే, అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఈ జాబితాలో ఒక్క భారత బౌలర్ కూడా లేడు.
వనిందు హసరంగా రికార్డు బ్రేక్..
శ్రీలంక దిగ్గజ ఆటగాడు వనిందు హసరంగా రికార్డును సందీప్ లామిచానె బద్దలు కొట్టాడు. హసరంగ 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. 71 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ బౌలర్ల జాబితాలో ముందులేకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, టీ20 ప్రపంచ కప్ 2024లో నేపాల్ ప్రయాణం ముగిసింది. బంగ్లాదేశ్ ఉంచిన 107 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో నేపాల్ జట్టు కేవలం 85 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సూపర్-8కి అర్హత సాధించింది.
విరాట్ భాయ్ మస్తు హ్యాపీ.. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు.. వీడియో
