India vs Pakistan: సెంచరీ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు కొట్టాడు. ఇది అతని కెరీర్‌లో 51వ వన్డే సెంచరీ. కోహ్లీ 90.09 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు.
IND vs PAK Live ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. కోహ్లీ సెంచరీ

Champions Trophy IND vs PAK Live updates : మరో హోరాహోరీ క్రికెట్ సంగ్రామానికి స్వాగతం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 23, 2025న) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ పాకిస్తాన్ ను చిత్తుచేసింది. పాకిస్తాన్ పై గెలుపుతో భారత్ ఇప్పుడు సెమీస్ కు చేరువైంది.
India vs Pakistan: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ
ICC Champions Trophy 2025: పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. సెంచరీ కొట్టిన కోహ్లీ
ICC Champions Trophy 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో విన్నింగ్స్ రన్స్ కొట్టాడు. 42.3 ఓవర్లలో భారత్ 244/4 పరుగులతో పాక్ పై విజయాన్ని అందుకుంది.
ICC Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ICC Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. 3వ వికెట్ గా శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. భారత్ 223/4 పరుగులతో మ్యాచ్ ను కొనసాగిస్తోంది.
ICC Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్.. 200 మార్కు అందుకున్న ఇండియా
ICC Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా 200 పరుగుల మార్కు అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీకి (81 పరుగులు) చేరువయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. భారత్ 201/2 (37) పరుగులతో మ్యాచ్ ను కొనసాగిస్తోంది.
India vs Pakistan: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
India vs Pakistan: పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ తన అద్భుతమైన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 74వ అర్ధ సెంచరీ. 27వ ఓవర్ తొలి బంతికి నసీమ్ షా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి విరాట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 136 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 65 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, శ్రేయాస్ అయ్యర్ 30 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
India vs Pakistan: 20 ఓవర్లలో భారత్ 109-2
India vs Pakistan: 20 ఓవర్లు పూర్తియిన తర్వాత భారత్ 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అలాగే, విరాట్ కోహ్లీ 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
India vs Pakistan: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నంత సేపు అద్భుతమైన షాట్స్ తో అలరించాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి

India vs Pakistan: రెండో వికెట్ కోల్పోయిన భారత్ 102/2 (18)
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ తో జరుగతున్న మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. భారత్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో కోహ్లీ 33 పరుగులు*, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగుల* తో ఉన్నారు.
India vs Pakistan: గిల్ దుమ్మురేపుతున్నాడు.. 10 ఓవర్లలో భారత్ 64-1 / 10 ఓవర్లు
Champions Trophy : తొలి పవర్ ప్లే పూర్తియిన తర్వాత భారత్ జట్టు 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 35 పరుగులు, కోహ్లీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Champions Trophy IND vs PAK: రోహిత్ క్లీన్ బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్
Champions Trophy IND vs PAK: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ధనాధన్ ప్లేయింగ్ ను మొదలుపెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే నషీమ్ షా బౌలింగ్ లో వరుసగా 4, 6 బాదాడు. మంచి జోరుమీదున్న రోహిత్ ను అద్భుతమైన బాల్ తో షాహీన్ అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. రోహిత్ 20 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 5 ఓవర్లలో భారత్ 1 వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. క్రీజులో గిల్, విరాట్ లు ఉన్నారు.
Champions Trophy IND vs PAK: భారత ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన రోహిత్, గిల్
Champions Trophy IND vs PAK: భారత క్రికెట్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. టీం ఇండియా ముందు 242 పరుగుల లక్ష్యం ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.
India vs Pakistan రివ్యూ: పాక్‌ని భారత్ చేజ్ చేస్తుందా? (వీడియో)
దుబాయ్‌లో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లలో విన్నింగ్ యావరేజ్ స్కోర్ 240-270 పరుగుల మధ్య ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ బౌలింగ్ కు మరింత అనుకూలంగా మారుతుంది. బ్యాటర్లు పరుగులు చేయడం కష్టం కాబట్టి పాకిస్తాన్ చేసిన పరుగులు భారత్ కు ఫైట్ ఇచ్చేవి. భారత్ కు ఓపెనింగ్ జోడీ నుంచి మంచి ఆరంభం కావాలి. ఒక్క ప్లేయర్ అయిన బిగ్ ఇన్నింగ్స్ ఆడితే భారత్ గెలుపును ఆపడం పాక్ కు కష్టమే.

Champions trophy 2025 India vs Pakistan: పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్
Champions trophy 2025 India vs Pakistan: పాకిస్తాన్ 241 పరుగులు చూసి 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.
బాబార్ ఆజం 23 పరుగులు
సౌద్ షకీల్ 62 పరుగులు
రిజ్వాన్ 46 పరుగులు
ఖష్ దిల్ షా 38 పరుగులు చేశారు.
భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.
IND vs PAK : మూడో వికెట్ తీసుకున్న కుల్దీప్ యాదవ్
IND vs PAK : ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్ ను మరో దెబ్బ కొట్టాడు. తన బౌలింగ్ లో పాక్ 8వ వికెట్ ను పడగొట్టాడు. నసీమ్ షా 16 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. 47 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఖుస్దిల్ షా, హరిస్ రవూఫ్ క్రీజులో ఉన్నారు.
Champions trophy 2025 IND vs PAK : వరుస బంతుల్లో వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
Champions trophy 2025 IND vs PAK : 43వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్ కు డబుల్ షాక్ ఇచ్చాడు. తాను 4వ బంతికి సల్మాన్ అలీ అగాను అవుట్ చేశాడు. సల్మాన్ 24 బంతుల్లో 19 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాహీన్ అఫ్రిది ఆ తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. పాకిస్తాన్ 43 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది.
Champions trophy 2025 India vs Pakistan: ఏడో వికెట్ డౌన్
పాకిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్ రన్ అవుట్ అయ్యాడు.
Champions trophy 2025 India vs Pakistan: ఆరో వికెట్ డౌన్
పాకిస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 42.4 ఓవర్ల వద్ద బ్యాటర్ సల్మాన్ ఆఘా 19 పరుగులు చేసి అవుటయ్యాడు.
Champions trophy 2025 India vs Pakistan: 5వ వికెట్ డౌన్
5వ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. 40 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 183 పరుగులు చేసింది. 5వ వికెట్ గా రవీంద్ర జడేజా బౌలింగ్ లో తయ్యబ్ తాహిర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
Champions trophy 2025 India vs Pakistan: మరొక వికెట్ డౌన్
Champions trophy 2025 India vs Pakistan: నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. హార్థిక్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడిన షకీల్ 62 పరుగుల వద్ద క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
Champions Trophy 2025 Ind vs Pak: పాక్ కెప్టెన్ రిజ్వాన్ క్లీన్ బౌల్డ్
Champions Trophy 2025 Ind vs Pak: పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ కెప్టెన్ రిజ్వాన్ ను 46 పరుగుల వద్ద అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ 154/3 (34) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.