కోహ్లీ మెరుపు ఫీల్డింగ్: టీమిండియా గెలుపు అప్పుడే ఖాయం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫీల్డర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌తో దుమ్మురేపే విరాట్.. మైదానంలోనూ మెరుపు ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫీల్డర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌తో దుమ్మురేపే విరాట్.. మైదానంలోనూ మెరుపు ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో తనలోని ఫీల్డర్‌ను మరోసారి చూపించాడు.
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు గాను బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్ కొలిన్ మున్రో సిక్సర్లు, ఫోర్లతో విజృంభిస్తుండటంతో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో కోహ్లీ అద్బుతమైన త్రో తో మున్రోను రనౌట్ చేశాడు.
Also Read:సాంత్నర్ కళ్లు చెదిరే క్యాచ్: విరాట్ కోహ్లీ మళ్లీ ఫెయిల్
శివం దూబే వేసిన 12వ నాలుగో బంతిని మున్రో కవర్స్ మీదుగా కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శార్థూల్ ఆ బంతిని అడ్డుకుని షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లీవైపు విసిరాడు.
మెరుపు వేగంతో బంతిని అందుకున్న కోహ్లీ అంతే స్పీడుతో బాల్‌ని స్ట్రైకింగ్ ఎండ్‌లో వున్న వికెట్లపైకి విసిరేశాడు. అప్పటికే రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న మున్నో రనౌటయ్యాడు.
నిజానికి రెండో పరుగు కివీస్‌కు తేలిగ్గా వచ్చేది. అయితే ఒక పరుగు తీసి మరో పరుగు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మున్రో రిలాక్స్ కావడంతో కివీస్ కీలక దశలో వికెట్ కోల్పోయింది. ఔటయ్యే సమయానికి మున్రో 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నాడు.
Also Read:ఫోర్త్ టీ20: సూపర్ ఓవర్లో మరో సూపర్ విక్టరీ... కివీస్ పై కోహ్లీసేనదే పైచేయి
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ మరోసారి సూపర్‌ఓవర్ సాయంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 165 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయడంతో టై అయ్యింది.