Asianet News TeluguAsianet News Telugu

ఫోర్త్ టీ20: సూపర్ ఓవర్లో మరో సూపర్ విక్టరీ... కివీస్ పై కోహ్లీసేనదే పైచేయి

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సీరిస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న కోహ్లీసేన మరో అద్భుత విజయాన్ని అందుకుంది. నాలుగో టీ20 కూడా సూపర్ ఓవర్ కు దారితీయగా మరోసారి భారత జట్టు అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది.

4th T20: India vs New Zealand match updates
Author
Wellington, First Published Jan 31, 2020, 12:15 PM IST

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సీరిస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న కోహ్లీసేన మరో అద్భుత విజయాన్ని అందుకుంది. నాలుగో టీ20 కూడా సూపర్ ఓవర్ కు దారితీయగా మరోసారి భారత జట్టు అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్లో 14 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు బంతుల్లోనే చేదించి కోహ్లీసేన విజయాన్ని అందుకుంది. 

సూపర్ ఓవర్ సాగిందిలా...

మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ సెఫర్ట్, టేలర్ లను బరిలోకి దించింది. ఈ సూపర్ ఓవర్ ను కూడా మూడో టీ20 మాదిరిగానే బుమ్రా వేశాడు. 

బాల్ టు బాట్ అప్ డేట్...

మొదటి బంతి క్యాచ్  మిస్, 2 పరుగులు 

రెండో బంతికి ఫోర్ బాదిన సేపర్ట్

మూడో బంతి 2 పరుగులు  

నాలుగో బంతికి సేఫర్ట్ ఔట్... బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్న వాషింగ్టన్ సుందర్  

 ఐదో బంతికి ఫోర్ కొట్టిన టేలర్ 

ఆరో బంతి సింగిల్. మొత్తంగా కివీస్ 13 పరుగులు బాది భారత్ ముందు 14 పరుగుల విజయలక్ష్యాన్ని వుంచింది. 

 టీమిండియా ఇన్నింగ్స్....

బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ... బౌలింగ్ సౌథీ

మొదటి బంతికే రాహుల్ సిక్సర్ బాదాడు. 

రెండో బంతికి ఫోర్ బాదిన రాహుల్ 

మూడో బంతికి రాహుల్ ఔట్... మరో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ  వద్ద  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

నాలుగో బంతికి కోహ్లీ  2 పరుగులు సాధించాడు.

ఐదో బంతి ఫోర్ బాదిన కోహ్లీ... మ్యాచ్ భారత్ వశం

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగుతున్న నాలుగో టీ20 కూడా టైకి దారితీసింది. ఇరుజట్లు 165 పరుగుల వద్దే తమ ఇన్నింగ్స్ ను ముగించాయి. దీంతో మరోసారి సూపర్ ఓవర్ తప్పలేదు. 

చివరి ఓవర్లో టిమిండియా బౌలర్ ఠాకూర్ మాయ చేశాడు. అతడు కివీస్ జట్టుకు చెందిన కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ టై అయ్యేలా చేశాడు. చివరి ఓవర్లో అతడు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. మొదటి బంతికే ప్రమాదకరమైన టేలర్ ను  ఔట్ చేసి భారత్ విజయావకాశాలను మరింత మెరుగుపర్చాడు.  అలాగే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సేఫ్టర్ 57, మిచెల్, సాట్నర్ లను ఔట్ చేసి భారత్ విజయావకాశాలను మెరుగుపర్చాడు. 

కివీస్ వికెట్ల పతనం మొదలయ్యింది. నిలకడగా ఆడుతూ కివీస్ జట్టును లక్ష్యఛేదన వైపు నడిపిస్తున్న మున్రో ఔటయిన వెంటనే బరిలోకి దిగిన బ్రూస్ కూడా వెంటనే వికెట్ కోల్పోయాడు. మూడు బంతులు ఎదుర్కొన్న అతడు పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 101 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

ఎట్టకేలకు కివీస్ ఓపెనర్ మున్రోను భారత జట్టు ఔట్ చేసింది. హాఫ్ సెంచరీతో అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్న అతడు 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యాడు. విరాట్  కోహ్లీ, టాకూర్ల సమన్వయంతో అతడు రనౌటయ్యాడు. దీంతో  కివీస్ 97 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

న్యూజిలాండ్ ఓపెనర్ మున్రో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కివీస్ జట్టు కేవలం 10 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఇలా భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యంవైపు వడివడిగా అడుగులేసినా ఫలితం దక్కలేదు. 

166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. 22 పరుగుల వద్ద ఓపెనర్ గుప్తిల్ ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో కివీస్ జట్టు 4 ఓవర్లలోనే మొదటి వికెట్ కోల్పోయింది. 

ఇప్పటికే న్యూజిలాండ్ తో జరుతున్న ఐదు టీ20ల సీరిస్ ను కైవసం చేసుకున్న కోహ్లీసేన నామమాత్రపు నాలుగో టీ20లో తడబడుతోంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 39 పరుగులతో పరవాలేదనిపించినా ఆ తర్వాత మిగతా బ్యాట్ మెన్స్ ఎవరూ రాణించలేకపోయారు. కానీ చివర్లో మనీష్ పాండే హాఫ్ సెంచరీతో చివరివరకు నాటౌట్ గా నిలవడందతో టీమిండియా 165 పరుగులయినా చేయగలిగింది. 

ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 8, విరాట్ కోహ్లీ 11, శ్రేయాస్ అయ్యర్ 1, దూబే 12, టాకూర్ 20, చాహల్ 1, సైని 11 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యాడు. కివీస్ బౌలర్లలో సోథీ 3, బెన్నెట్ 2, సౌథీ1, సాట్నర్ 1, కుగ్గెలెజిన్ 1 వికెట్ పడగొట్టారు. 

న్యూజిలాండ్ పై జరుగుతున్న నాలుగో టీ20లో ఇండియా 143 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. చాహాల్ ఒక్క పరుగు చేసి ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకు ముందు శార్ధూల్ ఠాకూర్ 20 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతూ వచ్చిన కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. శివం దూబే కేవలం 12 పరుగులు చేశాడు. 

న్యూజిలాండ్ పై శుక్రవారం జరుగుతుిన్న నాలుగో టీ20లో టీమిండియా 52 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సోథీ బౌలింగులో అవుటయ్యాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు చేసిన బెన్నెట్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో ఇండియా 48 పరుగుల వద్ద రెండో వికెట్ ను జారవిడుచుకుంది.

రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ ఫెయిలయ్యాడు. ఓ సిక్స్ కొట్టి పెవిలియన్ కు చేరుకున్నాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను అవుటయ్యాడు.దీంతో 14 పరుగుల స్కోరు వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది.

ఇండియాపై జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. 

తుది జట్టులో భారత్ భారీ మార్పులు చేసింది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత్ నాలుగో టీ20లో ప్రయోగాలకు దిగింది. రోహిత్ శర్మ స్థానంలో సంజూ శాంసను ఓపెనర్ గా దిగాడు. మొహమ్మద్ షమీ స్థానంలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా స్థానంలో నవదీప్ సైనీ తుది జట్టులోకి వచ్చారు.

ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను దురదృష్టం వెంటాడుతోంది. నాలుగో టీ20కి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా అతను ఈ మ్యాచులో ఆడడం లేదు. అతని స్థానంలో అతని స్థానంలో సౌథీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

తుది జట్లు

న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, కొలిన్ మన్రో, టామ్ బ్రూస్, రాస్ టైలర్, టిమ్ సీఫెర్ట్, మిచెల్ సాంత్నర్, స్కాట్ కుగ్గెలీన్, టిమ్ సౌథీ, సోథీ, హమీష్ బెర్నెట్

ఇండియా: సంజూ శాంసన్, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజవేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ

Follow Us:
Download App:
  • android
  • ios