IND vs NZ: 22 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
- Home
- Sports
- Cricket
- IND vs NZ Final Live: ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లైవ్ అప్డేట్స్
IND vs NZ Final Live: ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లైవ్ అప్డేట్స్

India vs New Zealand live, ICC Champions Trophy 2025 final: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మిచెల్ సాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లైవ్ క్రికెట్ స్కోర్, అప్డేట్లు ఇక్కడ చూడండి.
IND vs NZ Final LiveIND vs NZ: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ.. 10 నెలల్లో రెండో ICC టైటిల్... భారత్ రికార్డు
IND vs NZ Final LiveRohit Sharma: సచిన్, ద్రావిడ్ సరసన రోహిత్
India vs New Zealand: న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండరీల సరసన చేరాడు. రోహిత్ కొట్టిన రికార్డేంటి? మధ్యలో టెన్షన్ ఎందుకు?
పూర్తి కథనం చదవండిIND vs NZ Final LiveIndia vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్ గా భారత్
India vs New Zealand: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన జైత్రయాత్రను కొనసాగించింది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.
IND vs NZ Final Liveహార్దిక్ పాండ్యా ఔట్.. ఉత్కంఠగా మారిన మ్యాచ్
India vs New Zealand live, ICC Champions Trophy 2025 final: భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 18 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 48 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులతో ఆడుతోంది.
IND vs NZ Final LiveIndia vs New Zealand Live: అక్షర్ పటేల్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
India vs New Zealand Live: భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్ వెల్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడిన అక్షర్ పటేల్ క్యాచ్ రూపంలో ఓరూర్కే కు చిక్కాడు. అక్షర్ 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 42 ఓవర్లలో 203-5 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
IND vs NZ Final LiveIndia vs New Zealand live: 48 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ అవుట్
India vs New Zealand live: భారత జట్టు టార్గెట్ దిశగా ముందుకు సాగుతున్న సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ 48 పరుగుల వద్ద సాంట్నర్ బౌలింగ్ లో రచిన్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. భారత్: 190-4 (39 ఓవర్లు)
IND vs NZ Final LiveIndia vs New Zealand: ధోని రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
India vs New Zealand live: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోసారి శక్తివంతమైన రీతిలో గర్జించింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
IND vs NZ Final LiveIndia vs New Zealand live: రోహిత్ శర్మ ఔట్
India vs New Zealand live: భారత కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. హిట్ మ్యాన్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
భారత్ 129-3 (28.1 ఓవర్లు)
IND vs NZ Final LiveIndia vs New Zealand live: విరాట్ కోహ్లీ ఔట్
India vs New Zealand live: భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. బ్రేస్ వేల్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ 20 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో రోహిత్ శర్మ 70 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
IND vs NZ Final LiveIndia vs New Zealand live: హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ
India vs New Zealand live: రోహిత్ శర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇది. ప్రస్తుతం 11 ఓవర్లలో భారత్ 65 పరుగులతో ఆడుతోంది.
IND vs NZ Final LiveIndia vs New Zealand live: 5 ఓవర్లలో 31/0 పరుగులు.. దూకుడు పెంచిన రోహిత్
India vs New Zealand live: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఉంచిన 252 పరుగుల టార్గెట్ ను అందుకోవడంలో భారత్ కు శుభారంభం లభించింది. 5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్ 31 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ 21 పరుగులు, గిల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
IND vs NZ Final LiveIND vs NZ: ఇదెక్కడి ఫీల్డింగ్ సామి.. చెత్త రికార్డు సాధించిన టీమిండియా
India vs New Zealand live: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే, భారత జట్టు చెత్త ఫీల్డింగ్ తో వరుసగా క్యాచ్ లు వదిలిపెట్టింది. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
IND vs NZ Final LiveIND vs NZ Final Live: భారత్ ముందు 252 పరుగుల టార్గెట్ ఉంచిన న్యూజిలాండ్
IND vs NZ Final Live: భారత్ ముందు న్యూజిలాండ్ 252 పరుగుల టార్గెట్ ఉంచింది. 50 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. బ్రేస్ వెల్ సూపర్ ఇన్నింగ్స్ తో కీవీస్ జట్టు 250+ పరుగుల మార్కును అందుకుంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్:
డారిల్ మిచెల్ - 63 పరుగులు
బ్రేస్ వెల్ - 53*
రచిన్ రవీంద్ర - 37
గ్లెన్ ఫిలిప్స్ - 34
భారత్ బౌలింగ్:
కుల్దీప్ యాదవ్ - 2 వికెట్లు
వరుణ్ చక్రవర్తి - 2
IND vs NZ Final Live
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 252 పరుగులు కావాల్సి ఉంది.
IND vs NZ Final Liveమరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ రన్నవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 49.3 ఓవర్లకు 246 పరుగులు చేసింది.
IND vs NZ Final LiveIND vs NZ Final Live: డారిల్ మిచెల్ ఔట్.. న్యూజిలాండ్ 212-6 (46)
IND vs NZ Final Live: న్యూజిలాండ్ 6వ వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ తో డారిల్ మిచెల్ క్యాచ్ రూపంలో రోహిత్ శర్మకు దొరికిపోయాడు. 63 పరుగులు చేసి మిచెల్ పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 46 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
IND vs NZ Final Live6వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ కీలక వికెట్ కోల్పోయింది. 63 పరుగుల వద్ద మిచెల్ షమీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 46వ ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 212 పరుగుల వద్ద కొనసాగుతోంది.
IND vs NZ Final Live200 దాటిన న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్.
న్యూజిలాండ్ స్కోర్ 200 దాటింది. 45 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగల వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో మిచెల్ (53), మైకేల్ బ్రాస్‌వెల్ 24 పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
IND vs NZ Final Live5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.
మిచెల్, ఫిలిప్స్ భాగస్వామిని చెక్ పెడింది. బరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫిలిప్స్ బౌల్డ్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 52 బంతేలకలో 34 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 40 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
IND vs NZ Final Liveతడబడుతోన్న న్యూజిలాండ్..
భారత బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తడబడుతోంది. 36 ఓర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో ఫిలిప్స్ (28), మిచెల్ (41)పరుగుల వద్ద కొనసాగుతున్నారు. వీరిద్దరూ కలిసి మంచి భాగస్వామ్యాన్ని క్రియేట్ దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఈ పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేసేందుకు బౌలర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు.