న్యూజిలాండ్-టీమిండియా జట్ల మధ్య జరిగిన చివరి టీ20 సందర్భంగా ఓ భారతీయుడు కామెంటేటర్‌ను దూషించాడు. వివరాల్లోకి వెళివతే... న్యూజిలాండ్‌లో స్థిరపడిన ఓ భారత క్రికెట్ అభిమాని గ్రౌండ్‌లో ఉన్న కామెంటేటర్ వద్దకు వెళ్లి తనకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ అడగ్గా.. అందుకు ఆయన నిరాకరించాడు.

Also Read:క్లీన్ స్వీప్... సంజు శాంసన్ సూపర్ స్టంట్ చూశారా?

దీంతో కామెంటేటర్‌పై అభిమాని దూషణకు దిగాడు. మధ్యలో కలగజేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతనిని గ్రౌండ్ నుంచి బయటకు పంపించేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టేడియం నిర్వాహకులు సదరు అభిమానిపై నిషేధం విధించారు.

ఇక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు అతనికి అనుమతి ఇవ్వమని న్యూజిలాండ్‌ పబ్లిక్ ఎఫైర్స్ మేనేజర్ రిచర్డ్ బూక్ తెలిపారు. కామెంటేటర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతోనే ఈ నిషేధం విధించామని.. ఒకవేళ వర్ణ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసుంటే శిక్ష మరోలా ఉండేదని బూక్ పేర్కొన్నారు. అసలు ఇంతకి ఆ కామెంటేటర్ ఎవరు అన్న దాని గురించిన సమాచారం మాత్రం బయటకు రాలేదు. 

Also Read:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: శివమ్ దూబే చెత్త రికార్డు

కాగా గతేడాది చివర్లో ఇంగ్లాండ్ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌ను అసభ్యకర రీతిలో దూషించిన కేసులో ఓ క్రికెట్ అభిమాని రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వర్ణ వివిక్ష వ్యాఖ్యలతో పాటు.. అవమానించేలా మాట్లాడాడు. దీంతో తొలుత అతనిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత రెండేళ్ల పాటు క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్టేడియాలపై రాకుండా ఆ అభిమానిపై నిషేధం విధించారు.